భారత దేశానికీ మిషనరీల రాక! - Christian missionaries to India
భారతదేశం - దేవుని రాజ్యం ఈ భూభాగంలో దేవుని రాజ్య స్థాపన చేయించడానికి వచ్చిన మిషనరీ సంఘాలు నేపద్యం అలాగే వారు వచ్చిన సంధర్భాలలో వారు పొందిన శ్రమలను వివరిస్తుంది. క్రైస్తవ బాద్యతయైన దేవుని రాజ్య ప్రాతినిధ్యం మిషనరీ ఉద్యమం ద్వారా క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుంచే ఎలా ముదలయినది అన్నది. ఇప్పుడు చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును" అని యేసు తన శిష్యులకు చెప్పినట్లుగా ముందు యెరూషలేము తరువాత యూదులున్న ఇతర ప్రదేశాలు తరువాత సమరయ అటు తర్వాత భూదిగంతములు అన్న ప్రాతిపదికన అపొస్తలుడైన తోమా కూడా యూదులున్న ప్రాంతాలలో అది కూడా అరమైక్, గ్రీకు మాట్లాడే ప్రాంతాలను దర్శించడానికి పూనుకొని ఉంటాడు అన్నది చరిత్ర కారుల అంచనా. St. తోమా ఇండియాకు వచ్చాడని చెప్పిన వారిలో 2వ శతాబ్దానికి చెందినటువంటి బర్డిసానస్ (Select works of S. EPHREM the syrian). అలాగే 2వ శతాబ్దానికి చెందిన సిరియన్ క్రైస్తవ సంఘాల వారు ఉన్నారు. నాలుగో శతాబ్దపు కాలంలో క్రైస్తవ్యం భారతదేశంలో ఉందని ఆరవ శతాబ్దపు వ్యాపారస్తుడైన కాస్మాస్ తన ...