పోస్ట్‌లు

indus civilization లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

భారత చరిత్ర సింధు నాగరికత నుండి .. Indian History - భారత దేశంలో ఏకేశ్వర వాదం - Ancient Indian History

చిత్రం
  భారత దేశంలో ఏకేశ్వర వాదం.. భారత దేశానికి మిషనరీల రాక కేవలం 15వ శతాబ్దంలో మొదలయ్యింది అని అనుకోవడం చరిత్రను పూర్తిగా అధ్యయనం చేయక పోవడమే అవుతుంది. ఎందుకంటే జెసుయిట్లు మన దేశానికి మిషనరీ పనికి రాక ముందు నుండే మన దేశంలో క్రైస్తవ మిషనరీ పని మొదలయ్యింది. క్రైస్తవ భావజాలాన్ని బైబిలు నేర్పే ఏకేశ్వర వాదాన్ని ఈ భూభాగంలో తెలియపరచడానికి క్రీస్తు పూర్వం నుండి కూడా ఈ భూభాగ ప్రజలతో మధ్య ఆసియా ప్రజలకు వర్తక, వ్యాపార, రాజకీయ సంబంధాలు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ గారి ప్రకారం: క్రీ.పూ. 2600 - 1700 వరకు హరప్పా నాగరికత మన దేశంలో కొనసాగింది. క్రీ.పూ. 1500 - 500 వరకు వైదిక, నియోలితిక్ మరియు చాల్కొలితిక్ సంస్కృతుల వలస, ప్రభావం, ఆవిర్భావం చూస్తాం. క్రీ.పూ. 6వ శతాబ్దంలో గంగానదీ పరివాహక ప్రాంతాలలో నగరాలు, రాజ్య స్థాపనలు మొదలయ్యి మగధ రాజ్యం, మహావీర మరియు గౌతమ బుద్ధుల దర్శనం ఆవిర్భవించినట్టు చూస్తాం. క్రీ.పూ. 519లో పర్షియాకు చెందిన అకేమేడియన్ రాజు సైరస్ (కోరేష్) ఉత్తరభారత భూభాగాన్ని చాల వరకు తన రాజ్యంలో విలీనం చేయడంలో విజయం సాధించాడు. క్రీ.పూ. 493లో అజాత శత్రు రాజ్య స్థాపన చే...