పోస్ట్‌లు

Woman in the image of God లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

దేవుని రాజ్యం లో స్త్రీ.. Woman in the Kingdom of God

చిత్రం
  యేసు క్రీస్తుగా అనగా మెస్సియా లేక అభిషిక్తుడైన రాజుగా ఈలోకానికి వచ్చిన దినాలలో ఇలాంటి పోకడలే ఇశ్రాయేలు సమాజం వారు చేస్తూ ఉండే వారు. మత ఆచారాలకు పెద్దపీట వేసి దేవుని రాజ్య సంస్కృతిని, ప్రపంచముకు వెలుగుగా ఉండటానికి ఉంచబడిన దీపపు స్థంబము అన్న స్పృహ కోల్పోయిన యూదా సమాజం నిష్టా గరిష్టలతో మనిషిని మనిషినుంది వేరు చేయడానికి వారి ఆచారాలను ఒక ఆయుధంగా వాడుకున్నట్టు మనం చూస్తాం. అసలు ఇశ్రాయేలును రాజ్యంగా దేవుడు ఎన్నుకోవడం వెనుక ఉన్న నేపధ్యం ఏమిటి? అంత చిన్న జనాంగాన్ని ఆయన ఎన్నుకుని వారి పై రాజుగా ఉండటం వెనుక దేవుని ప్రణాళిక ఏమిటి? అని ఆలోచిస్తే బైబిల్ చెప్పే స్పష్టమైన వచనాలు. మనకు ఆ ప్రణాళిక ను తెలియజేస్తున్నాయి. యేసు శరీరధారియై ఉన్నప్పుడు మనుష్యుల నడుమ ఉన్న సామాజిక రుగ్మతలను సవాలు చేసాడు. ఒక వేశ్య వచ్చి యేసు ఉన్న ఇంటిలోకి వచ్చి అందరూ చూస్తు ఉండగా ఆయనను తాకేంత స్వాతంత్య్రాన్ని ఆయన పాపులుగా పిలువబడే వాళ్లకు ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. తాకడం మాత్రమే కాదు, అత్తరు ఆయన కాళ్ళ పై పోసి కన్నీటితో ఆయన కాళ్ళు కడిగే కార్యక్రమం ద్వారా కురులతో వాటిని తుడవటం ద్వారా, తన భక్తిని చాటి చెప్పింది. ఏ సమాజ...