భారత దేశానికీ మిషనరీల రాక! - Christian missionaries to India

 భారతదేశం - దేవుని రాజ్యం

ఈ భూభాగంలో దేవుని రాజ్య స్థాపన చేయించడానికి వచ్చిన మిషనరీ సంఘాలు నేపద్యం అలాగే వారు వచ్చిన సంధర్భాలలో వారు పొందిన శ్రమలను వివరిస్తుంది. క్రైస్తవ బాద్యతయైన దేవుని రాజ్య ప్రాతినిధ్యం మిషనరీ ఉద్యమం ద్వారా క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుంచే ఎలా ముదలయినది అన్నది. ఇప్పుడు చూద్దాం.

అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును" అని యేసు తన శిష్యులకు చెప్పినట్లుగా ముందు యెరూషలేము తరువాత యూదులున్న ఇతర ప్రదేశాలు తరువాత సమరయ అటు తర్వాత భూదిగంతములు అన్న ప్రాతిపదికన అపొస్తలుడైన తోమా కూడా యూదులున్న ప్రాంతాలలో అది కూడా అరమైక్, గ్రీకు మాట్లాడే ప్రాంతాలను దర్శించడానికి పూనుకొని ఉంటాడు అన్నది చరిత్ర కారుల అంచనా. St. తోమా ఇండియాకు వచ్చాడని చెప్పిన వారిలో 2వ శతాబ్దానికి చెందినటువంటి బర్డిసానస్ (Select works of S. EPHREM the syrian). 

Christian missionaries to India


అలాగే 2వ శతాబ్దానికి చెందిన సిరియన్ క్రైస్తవ సంఘాల వారు ఉన్నారు. నాలుగో శతాబ్దపు కాలంలో క్రైస్తవ్యం భారతదేశంలో ఉందని ఆరవ శతాబ్దపు వ్యాపారస్తుడైన కాస్మాస్ తన The Christian Topography of Cosmos Indicopleustes గ్రంథంలో ప్రస్తావించాడు. అలాగే భారతదేశంలో ఉన్న క్రైస్తవులు "మాకు క్రైస్తవ మిషనరీలు కావాలి. అని క్రీ.శ. 180లో ఐగుప్తు లోని అలెగ్జాండ్రియాకు ఆర్జి పెట్టుకున్నారు". అని కూడా (Stromatas Book1 By Clement of Alexandrines (150-215 AD), and Eusebius of Caesarea - 340 AD, Church History Chapter 10) అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.

కనుక భారత భూభాగంలోనికి క్రైస్తవ మిషనరీలు క్రీస్తు మరణ పునరుత్థానాలు జరిగిన వెంటనే ప్రవేశించారు. ఏకేశ్వర వాదం వినిపించే యూదులు క్రీస్తు పూర్వం నుండే ఇక్కడ ఉన్నారు. అయితే కాల క్రమేణా క్రైస్తవంలో అధికార, డినామినేషన్, వర్గ దాహం పెరగడం, సంఘంలో అనేకమైన చీలికలు, పెత్తందారీ కథోలిక వ్యవస్థ రావడం, తూర్పు సంఘo మరియు పశ్చిమ సంఘంగా విడిపోవడం, ఇలా ఎన్నో పరిణామాల ద్రుష్ట్యా క్రైస్తవ భావజాలం భారత భూభాగంలో విస్తరించలేదు అనే చెప్పాలి. 

ఆ సమయంలో ప్రొటెస్టెంటు ఉద్యమ నేపథ్యంలో సువార్త పరిచర్య అవసరత కథోలిక్కులకు మరియు కథోలిక్కులు కాని వారికి కూడా స్పష్టంగా అర్ధం అయ్యింది. ఆ క్రమంలో మొట్ట మొదటి సారి జెసుయిట్ మిషనరీలు పోర్చుగల్ ప్రాంతం నుండి వచ్చారు. వాస్కోడిగామా క్రీ.శ. 1500లలో ఇండియా వచ్చిన తరువాత 1534 లోపే పోర్చుగీసు వారు సంఘాలు, వేదబడులు, సాంఘిక సేవా సంస్థలు మొదలయినవి స్థాపించడం మొదలు పెట్టారు. అదే సమయంలో పోప్ సూచనల మేరకు జెసుయిట్ శాఖ వారు ఫ్రాన్సిస్ జేవియర్ను గోవా ప్రాంతానికి పంపగా ఆయన మే నెల తారీఖు 1542 గోవాలో అడుగు పెట్టాడు.


వాస్కోడిగామా క్రీ శ 1500లలో ఇండియా వచ్చిన తరువాత, రాబర్ట్ డి నోబిలి గారు 1605లో వచ్చి భారతీయ పద్ధతులలో సువార్త ప్రకటన చేసే ప్రయత్నం చేసారు. దీనికి సమాంతరంగా ప్రొటెస్టెంటు సంఘాలలో 1698లో "సొసయిటీ ఫర్ ప్రోపోగేషన్ ఆఫ్ క్రిస్టియన్ నాలెడ్జ్" స్థాపించబడి, అదే సంస్థ సముద్రాల ఆవల సువార్త ప్రకటన కోసం SPG (సొసయిటీ ఫర్ ప్రోపోగేషన్ ఆఫ్ గాస్పెల్) స్థాపించి భారత దేశానికి రావడానికి సిద్ధపాటు మొదలు పెట్టారు. ఇంతలోనే జెర్మనీ లూథరన్ సంఘాల వారు డెన్మార్క్ రాజు సహాయంతో పంపిన బర్తలోమీ జీగేన్బార్గ్ మరియు హెన్రీ ప్లెట్చావు ట్రాంకోబార్ ప్రాంతానికి జూలై 9, 1706న చేరారు. ఇలా ఒకరి తరువాత ఒకరుగా అన్ని మిషనరీ సంఘాలు మన దేశ భూభాగానికి వచ్చి చేరాయి. వారు అలా రావడానికి వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక అభధ్రతల గుండా వెళ్ళారు.

కామెంట్‌లు