దేవుని రాజ్యం లో స్త్రీ.. Woman in the Kingdom of God

 యేసు క్రీస్తుగా అనగా మెస్సియా లేక అభిషిక్తుడైన రాజుగా ఈలోకానికి వచ్చిన దినాలలో ఇలాంటి పోకడలే ఇశ్రాయేలు సమాజం వారు చేస్తూ ఉండే వారు. మత ఆచారాలకు పెద్దపీట వేసి దేవుని రాజ్య సంస్కృతిని, ప్రపంచముకు వెలుగుగా ఉండటానికి ఉంచబడిన దీపపు స్థంబము అన్న స్పృహ కోల్పోయిన యూదా సమాజం నిష్టా గరిష్టలతో మనిషిని మనిషినుంది వేరు చేయడానికి వారి ఆచారాలను ఒక ఆయుధంగా వాడుకున్నట్టు మనం చూస్తాం. అసలు ఇశ్రాయేలును రాజ్యంగా దేవుడు ఎన్నుకోవడం వెనుక ఉన్న నేపధ్యం ఏమిటి? అంత చిన్న జనాంగాన్ని ఆయన ఎన్నుకుని వారి పై రాజుగా ఉండటం వెనుక దేవుని ప్రణాళిక ఏమిటి? అని ఆలోచిస్తే బైబిల్ చెప్పే స్పష్టమైన వచనాలు. మనకు ఆ ప్రణాళిక ను తెలియజేస్తున్నాయి.

Woman washing Jesus feet


యేసు శరీరధారియై ఉన్నప్పుడు మనుష్యుల నడుమ ఉన్న సామాజిక రుగ్మతలను సవాలు చేసాడు. ఒక వేశ్య వచ్చి యేసు ఉన్న ఇంటిలోకి వచ్చి అందరూ చూస్తు ఉండగా ఆయనను తాకేంత స్వాతంత్య్రాన్ని ఆయన పాపులుగా పిలువబడే వాళ్లకు ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. తాకడం మాత్రమే కాదు, అత్తరు ఆయన కాళ్ళ పై పోసి కన్నీటితో ఆయన కాళ్ళు కడిగే కార్యక్రమం ద్వారా కురులతో వాటిని తుడవటం ద్వారా, తన భక్తిని చాటి చెప్పింది. ఏ సమాజం అయితే ఇటువంటి వారిని తాకడానికి కూడా ఒప్పుకోలేదో! అటు వంటి సమాజంలో ఆ స్త్రీతో బాహాటంగా అభిమానాన్ని స్వీకరించాడు యేసు. ఏ స్త్రీలనైతే కుక్కలకంటే తక్కువగా యూదా సమాజం చూసిందో అలాంటి వారిని శిష్యులుగా ఎన్నుకున్నాడు యేసు. ఏ సమరయులనైతే తాకడానికి కూడా యూదులు ఇష్ట పడలేదో అందులోనూ ఆ సమాజంలోని స్త్రీతో కూడా సంభాషించి మరీ వారి మధ్య అడ్డు గోడలను కూల్చివేశాడు. వేతనాలలో సమానత్వం పాటించి శ్రమ గౌరవాన్ని పెంచాడు, సుంకరులతో కూర్చుని బొంచేసి దేవుని రాజ్యము అనగా తీర్పు తీర్చడం కాదు సరిచేయడం, చక్క బెట్టడం, దేవునితో సమాధాన పరిచే పరిచర్య అని చాటి చెప్పాడు మన ప్రభువు. 

కామెంట్‌లు