భారత చరిత్ర సింధు నాగరికత నుండి .. Indian History - భారత దేశంలో ఏకేశ్వర వాదం - Ancient Indian History

 భారత దేశంలో ఏకేశ్వర వాదం..

భారత దేశానికి మిషనరీల రాక కేవలం 15వ శతాబ్దంలో మొదలయ్యింది అని అనుకోవడం చరిత్రను పూర్తిగా అధ్యయనం చేయక పోవడమే అవుతుంది. ఎందుకంటే జెసుయిట్లు మన దేశానికి మిషనరీ పనికి రాక ముందు నుండే మన దేశంలో క్రైస్తవ మిషనరీ పని మొదలయ్యింది. క్రైస్తవ భావజాలాన్ని బైబిలు నేర్పే ఏకేశ్వర వాదాన్ని ఈ భూభాగంలో తెలియపరచడానికి క్రీస్తు పూర్వం నుండి కూడా ఈ భూభాగ ప్రజలతో మధ్య ఆసియా ప్రజలకు వర్తక, వ్యాపార, రాజకీయ సంబంధాలు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ గారి ప్రకారం:

  • క్రీ.పూ. 2600 - 1700 వరకు హరప్పా నాగరికత మన దేశంలో కొనసాగింది.
  • క్రీ.పూ. 1500 - 500 వరకు వైదిక, నియోలితిక్ మరియు చాల్కొలితిక్ సంస్కృతుల వలస, ప్రభావం, ఆవిర్భావం చూస్తాం.
  • క్రీ.పూ. 6వ శతాబ్దంలో గంగానదీ పరివాహక ప్రాంతాలలో నగరాలు, రాజ్య స్థాపనలు మొదలయ్యి మగధ రాజ్యం, మహావీర మరియు గౌతమ బుద్ధుల దర్శనం ఆవిర్భవించినట్టు చూస్తాం.
  • క్రీ.పూ. 519లో పర్షియాకు చెందిన అకేమేడియన్ రాజు సైరస్ (కోరేష్) ఉత్తరభారత భూభాగాన్ని చాల వరకు తన రాజ్యంలో విలీనం చేయడంలో విజయం సాధించాడు.
  • క్రీ.పూ. 493లో అజాత శత్రు రాజ్య స్థాపన చేయడం జరిగింది. 
  •  క్రీ.పూ. 486లో బుద్ధుని మరణం.
  •  క్రీ.పూ. 321 వరకు నందుల పాలన భారత ఉపఖండంలో జరిగాయి. 
  • క్రీ.పూ. 327లో మకిదునియాకు చెందిన అలెక్చంద్రు (అలెగ్జాండర్) చందయాత్ర జరగడం అటు తరువాత చంద్రగుప్త మౌర్యులతో వలస వచ్చిన గ్రీకు మరియు పారశీకుల మిశ్రమం జరగడం, వారి ఉప జాతులను క్షత్రియులుగా పరిగణించడం జరిగింది.
  • క్రీ.పూ. 268 నుండి అశోకుని పాలన,
  • క్రీ.పూ. 185 లో పాటలీ పుత్ర నుండి మౌర్య సామ్రాజ్య అధికారాన్ని నిలువరించి శుంగులు పాలించడం మొదలయ్యింది.
  • క్రీ.పూ. 180 - 165 వరకు దేమేత్రి హయాంలో ఇండో గ్రీకు పాలన జరిగింది.
  • క్రీ.పూ. 166 - 150 వరకు మెనందర్ ఇండో గ్రీకు పాలన
  • క్రీ.పూ. 94 శకుల పాలన మొదలయ్యింది. 
  • క్రీ.పూ. 58 మొదటి అజేస్ విక్రమ రాజ్యాన్ని మొదల పెట్టారు.

క్రీ.పూ. 50న పార్థియన్ల రాజ్యం (దాని మరో పేరు సురేన్ రాజ్యం) లో గోండో ఫరస్ రాజు, డెక్కన్ ప్రాంతంలో శాతవాహనులు మరియు కళింగ ప్రాంతంలో ఖారవేల రాజ్యం మొదలయ్యాయి. ఇదే సమయంలో రోమీయులతో భారత భూభాగానికి అనేక వాణిజ్య సంబంధాలు కూడా నెలకొల్పబడ్డాయి. ఇదే సమయంలో భారత దేశ అపొస్తలుడుగా తోమా ఇక్కడ ఉన్న మధ్య ఆసియా ప్రజలకు, యూదులకు, అరమైక్ భాష మాట్లాడే వారికి సువార్త చేయడానికి వచ్చాడు. గొండోఫరస్ రాజు సమయంలో గ్రీకు, అరమైక్, పాళీ, భాషలు అధికారికంగా ఇక్కడ ఉండేవి. "క్రైస్తవ బోధ అనగా యేసు క్రీస్తు ఇచ్చిన బోధ ఇక్కడికి తోమా ద్వారా ప్రవేశించింది." అని చెప్పడానికి అనేకమైన ఆధారాలున్నాయి. అయితే పాత నిబంధన సమయం నుండే మధ్యధరా ప్రాంతానికి, మధ్య ఆసియా ప్రాంతానికి అలాగే అరామైక్ భాష మరియు హెబ్రీ భాష మాట్లాడే ప్రాంతానికి మన భూభాగంతో సంబంధాలున్నాయి అన్నది కూడా ఇక్కడ తెలుపక తప్పదు..

Monotheism


హెబ్రీయుల రాజైన సొలోమోను ఇశ్రాయేలు రాజ్యమును పాలించే సమయంలోనే (క్రీ.పూ. 10వ శతాబ్దం) భారత భూభాగానికి ఇశ్రాయేలుకు వర్తక సంబంధాలు ఉండేవి. 1 రాజులు 9:28 "వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చట నుండి యెనిమిది వందల నలువది మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి. " ఇక్కడ 'ఒఫీరు' అనే స్థలం తీర ప్రాంతంగా బంగారం దొరికేదిగా ఉండాలి. 1 రాజులు 10:22.

"సముద్రమందు హీరాము ఓడలతో కూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగి యుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగారమును, వెండిని, ఏనుగు దంతములను, కోతులను, నెమళి పిట్టలను తీసికొని వచ్చుచుండెను.” ఈ విధంగా తీర ప్రాంతమై ఉండి, బంగారు, వెండి, కోతులు, ఏనుగు దంతాలు, నెమళి పిట్టలు, సుగంధ ద్రవ్యాలు దొరికే ఒకే ఒక భారత భూభాగం అన్నది చరిత్ర కారుల అధ్యయన సారాంశం. ఇక్కడ 'ఓఫీర్' మరియు 'తరీషు' అన్న పేర్లు భారత ఉపఖండంలోని ప్రాంతాల పేర్లుగా గుర్తించారు. దీన్ని బట్టి "సుమారు క్రీ.పూ. 10వ శతాబ్దం నుండే ఇశ్రాయేలు ప్రాంతానికి చెందిన వారితో వర్తక వ్యాపార సంబంధాలున్నాయి" అని చెప్పడానికి ఆధారాలున్నాయి. మరియు వారి సమాజ గుంపులు, బొంబాయి, గుజరాత్, గోవా, కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలలో ఉన్నట్టుగా కూడా గుర్తించారు.

King Solomon's gold of ophir



కామెంట్‌లు