ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో మిషనరీలు వారి తిప్పలు...Missionaries struggles during the East India Company

ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో మిషనరీలు వారి తిప్పలు... 


1793 మరియు 1833 మధ్య భారతదేశంలో క్రైస్తవ మిషనరీల -కార్యకలాపాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి భిన్నంగా ఉండేవి, ఎందుకంటే అవి భారతదేశంలో రెండు ముఖ్యమైన యూరోపియన్ ప్రభావాలు. ఇ కాల పరిధిని ఎన్నుకోవడానికి ఒక కారణం ఉంది. 1793 మరియు 1833 మధ్య మిషనరీల నేపథ్యం అనుమతులు లేకుండా పని చేసే వారిలా గడపవలసి వచ్చిన పరిస్థితి అది. 1773లో రాబర్ట్ క్లైవ్ తో రెగ్యులేటింగ్ యార్డ్ మొదలు ఈస్ట్ ఇండియా కంపెనీలోని అధికారదాహం, లంచ గొండితను బ్రిటిష్ ప్రభుత్వ పర్యవేక్షణలో తగ్గుముఖం పట్టింది. 1784లో పిట్స్ యాక్ట్ ద్వారా కంపెనీ డైరెక్టర్ల (ఈస్ట్ ఇండియా కంపెనీ) పైన బోర్డ్ ఆఫ్ కౌని ఆధిపత్యానికి తేర లేపారు బ్రిటిష్ ప్రభుత్వం. 

Missionaries struggle during East India company


1793లో మిషనరీల రాక గురించి జరిగిన చర్చలో మిషనరీలను భారత దేశంలో రానివ్వకూడదు. అన్న విధంగా చర్చ కొనసాగింది. కానీ 1813లో భారత దేశంలో వర్తక వ్యాపారాలపై ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ (గుత్తాధిపత్యం) ని రద్దు చేసి మిషనరీల రాకకు స్వాతంత్రాన్ని సిద్ధం చేసింది బ్రిటీష్ ప్రభుత్వం. తరువాతి యాక్ట్ 1833లో చార్టర్ యాక్ట్ ను ఆమోదించారు. అంటే  తూర్పు ఇండియా వారి పరిపాలనకు సంబంధించిన యాక్ట్ లను ప్రభుత్వం ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పునర్విచారించి ఆమోదించేది. ఈ చార్టర్ యాక్ కారణంగా మిషనరీలు స్వేచ్ఛగా తమ కార్య కలాపాలను ముఖ్యంగా విద్య, మత వ్యాప్తి అనే అంశాలలో కొనసాగించ వచ్చు అన్న చట్టం వచ్చింది. ఇధే కాల వ్యవధిలో వారికున్న ప్రతికూల పరిస్థితులను మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలసీలను దేవుని రాజ్య విలువలకు అనుసంధానంగా తీసుకు రావడానికి మిషనరీలు పాట్లు పడవలసి వచ్చింది.


మిషనరీల యొక్క అద్భుతమైన పని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధుల అధికారిక సంప్రదాయవాదం నుండి ఒక శతాబ్దానికి పైగా ముందంజలో ఉంది అంటే ఈస్ట్ ఇండియా యొక్క నిర్లక్ష్యతను మరియు బలహీనతను గమనించవచ్చు. మిషనరీల ఉత్సాహం మరియు స్థిరత్వం యొక్క కలయిక శాశ్వత మరియు విలువైన పురోగతికి కారణమయ్యాయి. మిషనరీల కార్యకలాపాల విలువలను ఎవరైనా అభినందించాలి అంటే, వారి వలన జరిగిన మేలులు భారతీయులకే కాదు, భారతదేశంలో అధికారo కలిగి ఉన్న ఆంగ్లేయులకు కూడా వర్తిస్తాయి, సుమా! గుత్తాధిపత్య East ఇండియా కంపెనీ నుండి లైసెన్స్ లేకుండా చాలా మంది మిషనరీలు దేశంలోకి ప్రవేశించినందున, భారతదేశంలో అడుగు పెట్టడానికి కూడా వారి చట్టపరమైన హక్కు గురించి ఎవరికీ ఖచ్చితమైన అవగాహన లేకున్నా ఈ దేశ పరిస్థితులకు ఎలా స్పందించాలో తెలియని పరిస్థితిలో వారున్నప్పటికీ ఆ స్థితిలో కూడా వారి సేవలు మన దేశ ప్రజలకు మేలే చేసాయి.

Monopoly of East india company


ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు మిషనరీల పట్ల ఎటువంటి మద్దతు చూపకపోగా వారిలో చాలామంది మిషనరీల పనికి బలమైన వ్యతిరేకత కూడా కనబరిచారు. మిషనరీల సామాజిక రుగ్మతలు రూపుమాపే పోరాటం తరచూ స్థానిక అగ్రవర్ణాల నుండి తిరుగుబాటును ఎదుర్కొంటున్నందు వలన శాంతియుత ప్రభుత్వ నిర్వహణ అనే లక్ష్యం వారిని ఈ విధంగా ప్రవర్తించేలా చేసింది. మిషనరీలకు ఉన్న విధంగా విశ్వాస పునాదులు ఈస్ట్ ఇండియా కంపనీ వారికి లేవు కనుక ఇలాంటి మిషనరీ వ్యతిరేకతకు పాల్పడిందని చెప్పాలి.


ఆ గడ్డు కాలంలో అనగా 1793 నుండి 1833 వరకు పాలించిన గవర్నర్ జనరల పేర్లు గమనిస్తే:


సర్ జాన్ షోర్.       1793 - 1798

మార్కేస్ వెల్లెస్లీ        1798 - 1805

 అర్ల్ కార్న్ వాలిస్.   జూలై 30 అక్టోబర్ 5, 1805


సర్ జార్జ్ బార్లోవ.     1805 - 1807

 లార్డ్ మింటో.           1807 - 1813

లార్డ్ మొయిరా.        1813 - 1823

(మార్కస్ ఆఫ్ హేస్టింగ్స్)

జాన్ ఆడమ్                   జనవరి 9 - ఆగస్టు 1, 1823

లార్డ్ అమెర్స్ట్.                1823 - 1828

లార్డ్ విలియం బెంటింక్.    1828-1835


ఈ సంవత్సరాలన్నింటిలో మిషనరీలు తమకు చట్టపరమైన మిషనరీ పని చేయడానికి లైసెన్సు లేక పోయినప్పటికీ అనేకానేక కష్టాలలో జీవించి వారి మనుగడను, పరిచర్యను కొనసాగించారు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి