సనాతనధర్మం లో సతీసహగమనం - Sati in Sanatan Dharma

హిందూధర్మం లో సతీసహగమనం

వేదాలలో సతీ ప్రధ - Sati in Vedas

ఇయం నారీ పతిలోకం వ్రుణానా నిపఘత్ ఉపత్వా మధ్య ప్రేతం ధర్మం పురాణ మనుపాలయంతి తస్మై ప్రజాం ద్రవిణం చేహ దోహి అధర్వ వేదం 18/3/1 The Hymns of the Atharvaveda: Book IX.

ఈనారి పతిలోక ప్రాప్తి కొరకు ఓ మృతుడవైన పురుషుడా నీ వద్దకు సమీపించుచున్నది. నీతో కలిసి అగ్నిలో కాలి చనిపోవుచున్నది. ఇలా ఆమె సనాతన ధర్మపాలన చేస్తున్నది. ఇలా నీతో కలిసి కాలుతున్న ఈ స్త్రీకి ఈ లోకం, పరలోకం మరియు పునర్జన్మనందు పుత్రా, పౌత్ర ధనమును ప్రసాదించు. భార్య సతీగా అవడం కారణంగా పునర్జన్మనందు కూడా ఈ భర్తే లభిస్తాడు.

Sati in hinduism


రామాయణం లో సతీ - Sati in Ramayana

దశరథుని మరణం కారణంగా కౌసల్య అంటుంది “ఇదం శరీరమాలింగ్య ప్రక్ష్యామి హ్రుతానం అయోధ్య కాండం 66/12 అనగా నేను మహారాజు శరీరాన్ని ఆలింగనం చేసుకుని అగ్నిలో ప్రవేశిస్తాను.

ఆమె సతీసహగమనం చేయలేదు అన్నది నిజమైనా ఈ సందర్భం. హైందవసంస్కృతి లో సనాతన కాలం నుండి సతీ సహగమనం ఉందని నిరూపిస్తుంది.

అలాగే యద కాండ 32/32లో రావణానుగామిష్యామి గతిం భార్తుర్మహాత్మనై - రావణా నేను నా భర్తతో కలిసి సతీగా అవుతాను.

తతో మే జననీ దీనా తచ్చరీరం పితుర్మము, పరిశ్వజ్య మహాభాగా ప్రవిష్టా హవ్యవాహనం

                                            - ఉ.కాండ 17/15

కుశధ్వజ్ కుమార్తె వేదవతి ఇలా అంటోంది అప్పుడు మా అమ్మ మానాన్న శరీరాన్ని ఆలింగనం చేసుకుని అగ్ని ప్రవిష్టగా అయిపోయింది.

మహాభారతం లో సతీ - Sati in Mahabharatam

పాండవుల తండ్రి అయిన పాండు రాజు శవముతో పాటు మాద్రి అనే తన భార్య సతీ సహగమనం చెందినట్టు ఆది పర్వం 116-25 (టి.టి.డి.పబ్లికేషన్స్, నన్నయ భారతం 1.5.145-46)లో వ్రాయబడి ఉంది.

 కృష్ణుడి తండ్రి వాసుదేవుని భార్యలు అందరు అనగా దేవకీ, భద్రా, రోహిణీ, మరియు మదిరా తమ భర్తతో కలిసి అగ్నిలో కాలి చనిపోయారు. - మౌసల పర్వం 7/18. (The Mahabharata, of Krishna Dwaipayana Vyasa, translated by Kisari Mohan Ganguli, published between 1883 and 1896]

Sati in hindu dharmam


శ్రీ కృష్ణుడి అయిదు మంది భార్యలు రుక్మిణి, గాంధారి, శ్రావ్యా హైమాపతి, మరియు జాంబవతి తమను తాము కృష్ణుడి శవముపై కాల్చుకుని చంపుకున్నారు - మౌసల పర్వం 7/73-74

విష్ణుపురాణం 5/38/2 ప్రకారం కృష్ణుని ఎనిమిది మంది భార్యలు తన శవం పై సతీ సహగమనం చెందారు.

భాగవత పురాణం 1/13/59 ప్రకారం ద్రుతరాష్ట్రుని భార్య గాంధారి తన భర్త శవంపై తనను తాను చంపుకుంది.

ధర్మ శాస్త్రాలలో సతీ సహగమనం - Sati in Dharma Shastra

తిన్న కోటోగకోటియాని లోమాని మానవే తాపత్కాలం వసేత్ స్వర్గే భక్తారం యా అనుగచ్చతి వ్యాధిగ్రాహి యథావ్యాలం బలాద్రుద్ ధరతే బిలాత్ ఏవం స్త్రీ పతిముద్రుత్మ తేనైవ నహా మోదతే పరాశర స్మృతి by B.Vaitheeswaran 4 అధ్యాయం, 10/76,74, దక్షాస్మృతి 4/18-19. గరుడపురాణం 10/51

అనగా ఏ స్త్రీ అయితే తన భర్తతో కలిసి మరణిస్తుందో (అతని చితిపై కాలి చేస్తుందో ఆ స్త్రీ మూడున్నర కోట్ల సంవత్సరాలు స్వర్గ వాసిగా ఉంటుంది. పాములు పట్టే దాసరి ఏ విధంగా పామును బిలములో నుండి వెలికి తీస్తాడో అలాగే భర్త చితిపై కాలిన ఆ స్త్రీ తన భర్తను నరకములో నుండి వెలికి తీస్తుంది. ఆ భర్త కాలిన తన భార్యతో స్వర్గంలో ఉంటాడు.

తత్ర సా భర్తుపరమా స్తూయమానా అప్సరోగణైహ్ క్రీడతే పతినా సార్ధం యావదింద్రాశ్చతుర్దశా బ్రహ్మఘ్నా వా క్రుతఘ్న వా మిత్రఘ్న వా భవేత్ పతిహ్ పునాత్యవిధవా నారీ సమారోహేద్ హ్రుతాశనం. సాఅరుంధతీ సమాచారా స్వర్గే లోకే మహీయతే. యావచ్చాజ్ఞా మృతే పత్యౌ స్త్రీ నాత్మానం ప్రదాయేత్. తావన్న ముచ్యతే సా హాయ్ స్త్రీ శరీరాత్ కంథచన్ - యాజ్ఞవల్క్య స్మృతి 1/86 గురించి మితాక్షర టీకా, ఆపరార్కం, 110 పుట) -

అనగా భర్త శవంతో పాటు కాల్చుకుని చనిపోయిన స్త్రీ పదునాలుగు ఇంద్రుల కాలం సమాప్తం ఆయే వరకు స్వర్గమందు వసిస్తుంది. భర్తతో కలిసి కాలే స్త్రీ విధవ కాదు అవిధవ అవుతుంది. ఆమె బ్రహ్మ హత్య చేసిన వారిని, పుత్రఘ్నులను, మిత్రఘాతకులను కూడా నరకం నుండి విడిపిస్తుంది. ఆమె అరుంధతి వలె మారిపోతుంది. తన భర్త శవంతో కలిసి చావనంత వరకు స్త్రీ తన పునర్జన్మ నందు స్త్రీ గానే పుడుతూ ఉంటుంది.


అధర్వవేదం (9/5 27 మరియు 28) యొక్క రెండు మంత్రాలను వల్లించడం ద్వారా, వేదంలో వితంతువుల వివాహం జరిగినట్లు చెబుతారు.

యా పూర్వం పతిం విత్వాధన్యం విందతే వరం పంచ్ఛాదనం చ తావణం దాదాతో న వి యోష సమాన లోకో భవతి పునర్భువావర్ణ పతిప్ యోలజం పంచదనం దక్షిణా జ్యోతిచం దదాతి

అనగా స్త్రీ ముందు ఒక భర్తకు ప్రాప్తమై తరువాత ఇంకొక భర్తకు ప్రాప్తం అయితే, ఆ స్త్రీ మరియు తన రెండవ భర్త కలిసి పంచదన యజ్ఞం చేసి మేకను బలి ఇస్తే వారి ఎడబాటు ఎన్నటికీ జరుగదు. పునర్బూ స్త్రీ యొక్క రెండవ పంచౌదన యజ్ఞం చేసి మేకను బలి ఇచ్చి బంగారు ఉంగరం దక్షిణగా ఇస్తే సమాన లోకం వెళతాడు అని అర్థం.

ఈ శ్లోకంలో ఎక్కడా విధవ అనే పదం కనబడదు. ఒక భర్త నుండి ఇంకో భర్త వద్దకు వెళ్ళడమే ఇక్కడ చెప్పబడింది. అంతే కానీ విధవరాలి పెండ్లి చేయవచ్చు అన్న భావన ఈ శ్లోకంలో లేనే లేదు. కొందరు పునర్సుగా అన్న పదానికి వితంతువు యొక్క పునర్వివాహం అని వక్ర భాష్యం కొందరు చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ అది వ్యాకరణ రీత్యా మరియు పారంపరాచార రీత్యా సబబు కాదు. పునర్భు అనగా మళ్ళీ జరిగినది అని మాత్రమే అర్ధం. ప్రతి సాంకేతిక పదం నిర్దిష్ట అర్ధాన్ని కలిగి ఉంటుంది. దీన్నే విష్ణు సృతిలో ఇలా చెప్పారు:

అక్షతా భూ సంస్కృతా పునర్ముహ్ - విష్ణున్నతి 15/18

అనగా పురుషునితో అనుసంధానం కాని (అక్షతయోని గల) (స్త్రీ - తన భర్తను విడిచి వేరే పురుషున్ని పొందితే ఆమెను పునర్భు అంటారు. ఒకరిని వివాహం చేసుకున్న కన్య, మరొకరిని వివాహం చేసుకుంటే, దానిని 'పునర్బు' అని పిలుస్తారు -అన్యదత్తాతు యా కన్యా పునర్న్వత్ దీయతే పునర్బుహ్ సా ప్రకీర్తితా - వృద్ధ పరాశర స్మృతి మరియు అంగిరాస్మృతి (5/56)

యా కామారం భక్తారముత్ప్రజానై సహ చరిత్యాతస్పైన కుటుంబ మాత్రయతి నా పునరుద్ధవతి. యా చ క్లీలం పతిత మున్మత్రం వా భర్తార ముత్య అక్యాన్యం, పతిం చిందకే మలతే వా సా పునరుద్ధ్భవతి.

                               -పశిష్ట స్మృతి 17/20-21

వేదం కాలంలో విధవ పునర్వివాహం చేసుకుని పునర్సు అని పిలువబడదు. అని, పునర్భు అనగా ఏ మహిళ అయినా తన మొదటి భర్తను విడిచి రెండవ భర్త వద్దకు వస్తే ఆమెను అలా పిలుస్తారు అని పై మంత్రం నుండి స్పష్టమైంది. అలాగే, ముందు బ్రతికి ఉన్న భర్తను విడిచి వచ్చే వారిని పునర్పు అన్నారు తరువాత భర్త చనిపోయిన వారిని కూడా పునర్భు అని పిలవడం మొదలుపెట్టారు. రెండవ పెళ్లి చేసుకునే స్త్రీ యొక్క భర్త అంగీకారం తెలిపిన తరువాత ఆ స్త్రీని పునర్భు అని పిలవాలి.

Widow marriage


ఉద్వాహ తత్వంలో కశ్యపుడు చెప్పిన దాని ప్రకారం "సప్త పౌనర్భనై కన్యా వర్ణనీయ కులాధమా, పునర్సు ప్రభవా చ యా ఇత్యేకాకష్యపెనోకా దాహంతి కులమగ్నికా" అనగా వంశమును అగ్నిలా దహించే 7 రకాల పునర్పు కూడా ఉంది.

ఇలాగే అంగీరసుడు పునర్బ చేతి భోజనం తినకూడదని, వృద్ధ పరాశర స్మృతి (4/56)లో మరియు యాజ్ఞవల్క్య స్మృతి (1/224) లో కూడా పునర్సును నిందించడం చూడగలం.

కనుక వేదంలో విధవరాలి యొక్క పునర్వివాహం లేనేలేదు. అలాగే పునరు అన్న పదం ఒక ఘోరమైన తప్పు చేసిన స్త్రీని సూచించే తిట్టు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. నగా ఒక భర్తను విడిచి ఇంకో భర్త వద్దకు వెళితే ఆ భర్త తనకు ఎప్పుడు తోడుగా ఉండటానికి మేకను బంగారమును అర్పించాలి. అన్నది ఇంతవరకు చూసాం. దీని ద్వారా అనగా ఈ శాస్త్ర కార్యం ద్వారా స్త్రీకి అదే భర్త దొరకడానికి ఒక మార్గం బ్రాహ్మణులు సూచించారు. ఇది కాల క్రమేణా ఎలా పరిణమించింది అనేది చూద్దాం..

ఉత్ యత్ పతయూ దశ ప్రియా పూర్వే అబ్రాహ్మణ బ్రహ్మా చేడ్ హస్తమగ్రహీస్య ఏవ పతిరేకదా. బ్రాహ్మణ ఏవ పతి రాజన్యో న వైశ్య

అనగా బ్రాహ్మణునికి ముందు ఒక స్త్రీకి 10 మంది పతులున్నా బ్రాహ్మణుడు. పాణిగ్రహణం చేసుకున్న తరువాత ఆమె బ్రాహ్మణునికి మాత్రమే భార్య అవుతుంది. బ్రాహ్మణుడు మాత్రమే నిజమైన భర్త, క్షత్రియుడు లేక వైశ్యుడు ఇలా అవలేదు.

ఈ మంత్రం ద్వారా సతీ వ్యవస్థ లేదు అని ఎలాగు చెప్పలేరు. కానీ బ్రాహ్మణుడు ఇతరుల భార్యలపైన అధికారం కలిగి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అతడు బ్రాహ్మణుడు కాబట్టి. ఎవరి భార్యను బ్రాహ్మణుడు పట్టుకుంటే ఆమె బ్రాహ్మణుడి భార్య అయిపోతుంది.

సతీ సహగమన వ్యవస్థను బ్రాహ్మణ వివాహం చేత ఆపే ప్రయత్నం ఏదో జరిగింది అని మసి పూసే ప్రయత్నం చేసే వారు ఇలాంటి మంత్రాలను చూపిస్తుంటారు కానీ నిజానికి ఈ మంత్రం ఆధారంగా ఈనాటి కే ప్రాంతానికి చెందిన సంబుద్రి బ్రాహ్మణులు సగటు ఉన్నితిరీ, తిమురీ స్త్రీలను వారిని పెండ్లాడిన భర్తల వద్దకు పంపడానికి ముందు బ్రాహ్మణుడితో శోభనం. జరిపేవారు.

Widow marriage


నిజానికి ఇటువంటి మంత్రాల ద్వారా వితంతు వివాహాలు జరిగాయని చెప్పలేం కానీ నియోగం అనే ఇంకొక అమానవీయ సంస్కృతికి శ్రీకారం చుట్టారు బ్రాహ్మణ వాదులు.


కామెంట్‌లు