విధేయతే రాజ్యాధికార మార్గం | Obedience is the path to statehood

విధేయతే రాజ్యాధికార మార్గం | Obedience is the path to statehood

మానవులు దేవుడనుగ్రహించే మహిమకు దూరం కావడానికి గల ఏకైక కారణం మానవుడు స్వచ్ఛందంగా దేవుని తండ్రి వంటి అధిపత్యాన్ని కాదనుకుని శత్రువైన అవవారికి లోబడే నిర్ణయం తీసుకోవడం, అదే ఆజ్ఞాతిక్రమం దాన్నే పాపం అంటారు. ఈ అవిధేయతకు పర్యవసానమ మనపై స్వచ్ఛందంగా మనం కోరుకున్న సాతాను అధికారం. అవిధేయత రాజ్యాధికారం తెచ్చిపెడుతుంది అనుకున్న మానవ కల్పన లేక తిరుగుబాటు ప్రేమపూర్వక ప్రాతినిధ్యాన్ని కోల్పోయేలా చేసింది. ఉన్న ప్రాతినిధ్యం కాస్తా కోల్పోయిన మానవుడు చచ్చిన స్థితి లేక దైవరాహిత్యం అనే స్థితికి దిగజారి సాతాను అధికారం క్రింద వాడి రాజ్య విలువలు అయిన సిగ్గు పరచబడటం, చిన్న చూపు, నిందారోపణ, స్వార్థం వంటి ప్రతికూల విలువలతో తన మానవ మనుగడను చస్తూ రావడానికి పరిస్థితి నుండి తనను తాను విడిపించు కోలేని పరిస్థితిలో ఉన్న మానవునికి మానవ రూపంలో అవిధేయత పై జయం సాధించడానికి విధేయుడై వచ్చాడు మానవ జాతి ఉద్ధరణకు తన జీవితాన్ని సైతం పానార్పణంగా పోసిన యేసు నాథుడు.
 

disobedience


"మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును.. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను ఆదాము రాబోవువానికి గురుతై యుండెను. అయితే.. యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను.. మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు.. అలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.” (రోమా 4:24 - 5:21).

ఇక్కడ చాలా వరకు క్రైస్తవ దృక్పథమును కేవలం చనిపోయి పరలోకం వెళ్ళడం వరకే విలువరించే మతం, నీతిమంతునిగా తీర్చబడటం అంటే "పరలోకం పోయేందుకు అర్హత" అని చెబుతుంది. అది సత్యం అయినప్పటికి సంపూర్ణ సత్యంలో ఒక భాగం మాత్రమే అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. యేసు మనలను దేవుని కుటుంబంలో భాగస్తులనుగా చేయడానికి అవసరమైన నీతిని తన విధేయత ద్వారా మనపై ఆపాదించటానికి తన పుణ్య కార్యమైన విధేయతను జరిగించాడు. అందులో నిత్యరాజ్యంలో మనం ఆయనతో కూడా ఏలడం కూడా భాగమే. ఆ నిత్యరాజ్యం సర్వసృష్టి పైన దేవుడు మనకిచ్చిన అధికారం మరియు ప్రాతినిధ్యాన్ని ఏదేను తోటలో కలిగి ఉన్న ప్రకారంగా కలిగి ఉండబోయే నిరీక్షణను సూచిస్తుంది.

"శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్ధనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికిని నిత్యరక్షణకు కారకుడాయెను." -హెబ్రీ 5:7-10

"శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము" అని పౌలు చెబుతుంటే హెబ్రీ; గ్రంథకర్త "పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను". అని యేసు పొందిన శ్రమలలో మనం పాలివారం అయ్యేట్టుగా మనలను జయించిన వారికంటే అధికులుగా చేశాడు మన నిత్య రక్షకుడు. 

కనుక 'విధేయత' అనే ఒకే ఒక మార్గంలో అవిధేయతకు మరియు దాని పర్యవసానంగా వచ్చిన పతన స్థితికి శిక్ష విధించి ఆయన విధేయత కారణంగా స్వాతంత్య్రాన్ని మరియు 'షలోమ్' అనే స్థితిని తిరిగి స్థాపించి దేవుని పిల్లలుగా మనకు అధికారమునిచ్చి, ఆయన రాజ్యములో భాగంగా కుటుంబ వాతావరణాన్ని తండ్రికి పిల్లలకు ఉన్న సంబంధాన్ని తిరిగి స్థాపించడం అనే సంధి చేసే పరిచర్యను జరిగించాడు ఆ దేవాది దేవుడైన యేసు ప్రభువు. ఇది ఆయన రాజ్యములోని ఆధిపత్యానికి మరియు సాతాను రాజ్యంలో ఆధిపత్యానికి ఉన్న తేడా. సాతాను రాజ్యంలో విధేయత అంటే బలహీనత, దేవుని రాజ్యంలో విధేయత అంటే తండ్రి పిల్లల నడుమ సంబంధ బాంధవ్యాల మాధుర్యం. సాతాను రాజ్యంలో స్వేచ్చ అంటే అవిధేయత దేవుని రాజ్యంలో స్వేచ్ఛ అంటే విధేయత యొక్క పరిణామం. ఇలా పరస్పర విరుద్ధ రాజ్య విలువల నడుమ జరిగే దృక్పథ సంగ్రామంలో దేవుని రాజ్య ప్రాతినిధ్యం చేయడం ఏలీయా చేసిన ప్రవక్త పరిచర్య..

మా ప్రభు జూపుము నీదు మార్గపు మాదిరి జాడలను నీదగు మాదిరి - జాడలను = మా పాదములను తొట్రెలకుండగ మా కిడు బలమును యీ కృపా దినమున
                                                                                                    -ఎ. చార్లెస్ కిన్సింగర్


abraham




కామెంట్‌లు