స్వరాజ్యం - రామ రాజ్యం | SvaRajyam - Rama Rajyam

స్వరాజ్యం - రామ రాజ్యం | Self kingdom - Kingdom of Rama

 'జై శ్రీరాం' అనే కేకలు ఈ రోజు దేశమంతా వినిపిస్తున్నాయి. భక్తితో కూడిన పలుకులు అందరూ ఆహ్వానిస్తారు. కానీ మతోన్మాద దురహంకార ధోరణితో చాతుర్వర్ణ రాజ్యమును దానిలో బహుజనుల అణిచివేతను ప్రతిబింబించేలా ఈ కేకలు ప్రజల మనస్సులో కక్షను, కోపాన్ని, కొన్ని సమాజాలపై విద్వేషాన్ని రెచ్చ గొట్టే విధంగా ఉండటం రామ రాజ్య స్వభావానికి అద్దం పడుతునాయి. బహుజన మైనారిటీ ప్రజలను రెండవ శ్రేణి ప్రజలుగా అణచివేతకు గురిచేసి తిరిగి పేష్వాల రాజ్యాన్ని స్థాపించే బ్రాహ్మణవాద అజెండాయే ఈ రామ రాజ్య అజెండా,

నా చిన్నతనంలో హనుమంతుడు అంటే బలానికి, దీనత్వానికి, నమ్మకత్వానికి ప్రతీకగా ప్రజలు చెప్పడం నేను విన్నాను. కానీ బజరంగ్ దళ్ పేరట శూద్ర యువకులను బ్రాహ్మణ భావ జాలానికి పావులుగా వాడుకుంటూ వారి బహుజన బలాన్ని దేశ విచ్చిన్నం కోసం వాడే బ్రాహ్మణ భావజాలానికి బలి అయిపోయిన గిరిజన, బహుజన నాయకుడుగా, కోపానికి, రౌద్రానికి, మారణహెరామానికి చిహ్నంగా హనుమంతుడు రోజు రోజుకీ, ప్రజలను భయ భ్రాంతులను చేయడానికి వాడుకునే ప్రతీక అని ఇప్పుడు అర్థం అవుతోంది. ఈ రకం హనుమంతుని నమ్మకత్వం, విశ్వాస్యత ఎవరి కోసం? శూద్ర బహుజన జాతులను అణచి వేసే బ్రాహ్మణ భావజాలానికి తలమానికమైన నాయకుడుగా చిత్రీకరించబడిన రామునికి. ఆ రాముని రాజ్య స్థాపనలో హనుమంతుని సేన - అదే. ఈ నాటి రౌడీ మూకలు తమ పై ఆపాదించుకునే మత ఉగ్రవాద గుంపులు - బ్రాహ్మణ వాద రాజ్యాన్ని భారత దేశంలో స్థాపించడానికి తెగ కష్టపడిపోతున్నారు. ఇంతకూ రామ రాజ్యంలో రాముడు ఎలా పరిపాలించాడు. ఆయన విలువలు ఏమిటి? స్త్రీ, శూద్ర, సవర్ణుల పట్ల ఆయన వైఖరి ఏమిటి? ఇవన్నీ గమనించి అసలు ఈ రామ రాజ్యాం మనకు కావాలా అని ప్రశ్నించుకుందాం.

rama rajyam

రామరాజ్యంలో రాముడి దినచర్య చూస్తే ఇక రాజ్యం. చేయడానికి సమయం ఎక్కడి నుండి వచ్చిందా అన్న ఆలోచన కలుగుతుంది. ఆ రాత్రి తెల్లవారగానే రాజును మేల్కొలుపు సౌమ్యులైన ఈ ప్రాతకాలమునందు రాజప్రసాదమునకు వచ్చిరి.

        మూ. తే రక్తకనినై సర్వే కింనరా ఇవ శిక్షిత్తా, 

        తుష్టువురపతిం వీరం యథావత్ సంప్రహర్షిణ   -ఉ.కాండ స.373.

సుశిక్షుతులైన కింనరుల వలె మధురకంఠధ్వని గల వాళ్ళందరూ సంతోషవంతులై వీరుడైన రాజును యథావిధిగా స్తుతించిరి. (ఈ బ్లాగ్ లో రామాయణంలోని అన్ని శ్లోకాలు, తాత్పర్యాలు పుల్లెల శ్రీరామ చంద్రుడు, రామాయణం నుండి తీసుకోవడమైనది.)

        వీర సౌమ్య ప్రబుద్యస్వ కౌసల్యా ప్రీతివర్ధన, 

        జగద్ధి సర్వం స్వపితిత్వయి సుస్తే నరాధిప  -ఉ.కాం. స.37-4

కౌసల్యకు ఆనందమును వృద్ధిపొందించు, వీరుడవు, సౌమ్యుడు అయిన రామా! మేల్కొనుము. రాజా! నీవు నిద్రపోవుచున్నచో జగత్తు అంతా నిద్రపోవును గదా?

నీ పరాక్రమము విష్ణువు పరాక్రమము వంటిది. రూపము అశ్వినీదేవతల రూపము వంటిది. నీవు బుద్ధిచేత బృహస్పతితో సమానుడవు. ప్రజాపతి వంటివాడవు. నీ ఓర్పు భూమి ఓర్పు వంటిది. నీ తేజస్సు సూర్యుని తేజస్సుతో సమానము. నీ వేగము వాయువుతో తుల్యము. గాంభీర్యము సముద్రము గాంభీర్యము వంటిది. నీవు శివుడువలె కదల శక్యము కానివాడవు. నీవంటి సౌమ్యత్వము ఇంద్రునిలో మాత్రమే ఉన్నది. మహారాజా! నీవంటి రాజులు పూర్వమెన్నడూ లేరు. మున్ముందు పుట్టరు అంటూ గానములతో రామున్ని లేపాలి.. లేచిన రాముడు ఏం చేస్తాడు అంటే..

        తముత్తితం మహాత్మానం ప్రహ్వాతి ప్రాణాళాయో సరా, 

        సలిలం భాజనై శుభైరుపతస్థు సహస్రశ,  -ఉ.కాండ. 37:12.

ఆ రాముడు లేవగానే అనేకమంది మనుష్యులు వినయముతో దోసిలి కట్టీ నమస్కరించి, శుభ్రములైన పాత్రలతో జలమును తీసికొనివచ్చి అతనిని సమీపించిరి. 

        కృతోదకై శుచిర్భూత్వా కాలే హతహుతాశన, 

        దేవాగారం జగామాశు పుణ్యమిక్ష్వాకు సేవితమ్ -ఉ.కాండ. 37:13

స్నానము చేసి పవిత్రుడై, తగు కాలమునందు అగ్నిహెూమము చేసి, శీఘ్రముగా ఇక్ష్వాకు రాజులచేత సేవింపబడిన పవిత్రమైన దేవతాగృహమునకు వెళ్ళెను. అక్కడ రాముడు దేవతలను, పితృదేవతలను, బ్రాహ్మణులను యథావిధిగా పూజించి, జనులతో కలిసి బైటనున్న వాకిలి దాటి వచ్చెను. పురోహితులు, మహాత్ములైన మంత్రులు, ప్రజ్వలించుచున్న అగ్నులవలె ఉన్న వశిష్నాదులు ఆధరపూర్వకముగా అతని దగ్గరకు చేరిరి. అనేక దేశాల ప్రభువులైన మహాత్ములైన క్షత్రియులు కూడా ఇంద్రుని ప్రక్క దేవతలు కూర్చున్నట్లు రాముని ప్రక్క కూర్చుండిరి.

దేవేంద్రుని చుట్టూ ఎల్లప్పుడూ ఋషులు ఉన్నట్లు రాముని చుట్టూ, ఉత్తములైన ఋషులు, గొప్ప పరాక్రమము రాజులు, వానరులు, రాక్షసులు ఉండిరి. కానీ రూపసంపదచేత రాముడు దేవేంద్రునికంటే అధికముగా ప్రకాశించుచుండెను వారందరూ కూర్చొని ఉండగా పురాణములను ఎరిగిన ధర్మబోధకములు కథలు చెప్పుచుండిరి.

అంటే రాముడు లేవడం, సేవకుల సేవలతో శుద్ధుడై రాజ భవనానికి వచ్చి రుషి, రాజుల మధ్య కూర్చోని కథలు వినడం ఆయన రోజు పరిపాటి. ఇలా ఉదయమంతా గడిపిన రాముడు మధ్యాహ్నం వచ్చే సరికి ఇంకో చోట సమయాన్ని గడుపుతాడు.

ధర్మములన్నీ తెలిసిన రాముడు పూర్వమునందు ధర్మానుసారముగా చేయవలసిన ధర్మకార్యములన్నీ పూర్తిచేసికొని అపరాప్ఘ మును అంతఃపురములో గడుపుచుండెడివాడు. ఉదయం కథలు వింటూ  రాజభవనం, మధ్యాహ్నం అంతఃపురములో గడపడం రామునికి దినచర్యగా పది వేల సంవత్సరాలు గడిచాయి అని శ్రీ మద్రామాయణం ఉత్తరకాండ 42:26 లో వ్రాయబడి ఉంది. 

        సీతామాదాయ హస్తేన మధు మైరేయకం శుచి, 

        పాయయామాస కాకుత్థ శచీమివ పురస్థర     -ఉ.కాండ. 42:18

రాముడు పరిశుద్ధమైన మైరేయకమను మధ్యమును చేతితో తీసికుని, ఇంద్రుడు శచీదేవికి త్రాగించినట్లు సీతకు త్రాగించెను.

        మాంసాని చ సుమృష్టాని ఫలాని వివిధాని చ, 

        రామస్యాభ్యవహారార్థం కింకరాస్తూర్ణమాహరన్. - ఉ.కాం.42:19

రాముడు భుజించుటకై కింకరులు బాగా శుద్ధిచేసిన మాంసములు అనేకవిధములైన ఫలములను శీఘ్రముగా తీసికొని వచ్చిరి.

        ఉపానృత్యంశ్చ రాజానం నృత్యగీతవిశారదా, 

        అప్సరోరగసంఘాశ్చ కింనరీపరివారితా,     -ఉ.కాండ. 42:20

కింనర స్త్రీలతో కూడిన, నృత్య సంగీతములయందు నేర్పుగల అప్సర స్త్రీలు, ఉరగస్త్రీలు రాముని దగ్గర నృత్యములు చేసిరి. మంచి నేర్పు గల, సౌందర్యవతులైన, నృత్యగీతములలో ప్రావీణ్యము గల స్త్రీలు పానమునకువశులై రాముని దగ్గర నృత్యము చేసిరి. ఆనందింపచేయు వారిలో శ్రేష్ఠుడు, ధర్మాత్ముడూ అయిన రాముడిని ఆకర్షించు, బాగా అలంకరించుకొనిన ఆ స్త్రీలను నిత్యము క్రీడింపచేసెను. సీతారాములు చిరకాలము ఈ విధముగా భోగములను అనుభవించుచుండగా ఎల్లప్పుడూ భోగమును అనుభవించుటకు అనువైన, రమ్యమైన కాలము గడచెను.

ఇది పుల్లెల రామచంద్రుడు రచించిన వాల్మీకి రామాయణము తెలుగు భాషలో ఉన్న వివరణ. రాముడు రోజు ఇలా కథలు వినడానికి, ఉద్యాన వనంలో సీతతో కలిసి మాంసము, మధ్యము సేవిస్తూ స్త్రీల నాట్యాన్ని ఆనందిస్తూ వారిని క్రీడింపజేసే జీవన విధానాన్ని కలిగి ఉండేవాడు. ఇది కేవలం ఇక్కడ మాత్రమే ప్రస్తావించిన విషయం కాదు. యుద్ధ కాండలో కూడా రాముని అరణ్య వాసానికి ముందు కలిగి ఉన్న బహు స్త్రీ సంబంధాలను సూచించారు. 

        మణిక్చానకేయూరముక్తాప్రవరభూషణై, 

        భు పరమనారీణామభిమృష్టమనేకధా.

రాముని బాహువును పూర్వము మణులు పొదిగిన బంగారు దండకడియాలు, శ్రేష్టములైన ముత్యములు అలంకారముగా గల ఉత్తమ స్త్రీల భుజములు అనేక విధముల స్పృశించినవి.

రామరాజ్యంలో రాజ్య భారం ఎవరిపై మోపాలని ఇక్కడ రామరాజ్య అభిలషిక్తులు కోరుకుంటున్నారు. అంటే ఉదయమంతా లేవడానికి పాటలు పాడించుకుని, లేచిన తరువాత ఒళ్ళు కడుక్కోవడానికి సేవకులు చేతులు కట్టుకుని నిలబడుకుని, రాజ భవనంలో ఋషుల మధ్య కథలు విని మధ్యాహ్నం అంతా సీతా సమేతుడై మద్యం తాగుతూ కన్యల నాట్యంలో రమించే వ్యక్తికి రాజ్యభారం ఇవ్వాలనే కోరిక.. బాగానే ఉంది.

అసలు ఆయన (రాముడు) ఎంత పక్షపాత ధోరణిని ప్రదర్శించేవాడో తెలుసుకోవాలి అంటే బాలకాండం 25వ సర్గలో చూడాలి: యక్షులు అనబడిన వారు బ్రాహ్మణ క్షత్రియ రాజ్యమును అంగీకరింపనివారు. అలాంటి వారి రాజ్యంలోకి విశ్వామిత్రుడుతో కలిసి వెళుతున్న సమయంలో రాముడికి విశ్వామిత్రుడు చెప్పినట్టు అగస్త్యుని శాపం రావడం, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిరోధించినందుకు తాటకను రాముడు చంపడం ద్వారా రాముని రాజ్యంలో కేవలం బ్రాహ్మణ ఆధిపత్యానికి మాత్రమే పెద్ద పీట వేస్తారని వేరే చెప్పక్కరలేదేమో. అగస్త్యుని క్రూరత్వాన్ని మరిచి తాటకను కేవలం బ్రాహ్మణుల కళ్యాణార్ధం చంపడం ఎంత వరకు న్యాయమైన పని అన్నది రామ రాజ్యమును. కోరే వారి విజ్ఞతకు వదలాలి.

ఇలాంటి అన్యాయమే రామరాజ్యంలో ఇంకో చోట కూడా కనిపిస్తుంది. అదే వాలి వధ!

        దృశ్యమానస్తు యుధ్యేథా మయా యుధి సృపాత్మజ, 

        అద్య వైవస్వతం దేవం పశ్యేస్త్వం         నిహతో మయా -కిష్కి,కాం. స.17.46

రామా! యుద్ధరంగములో ప్రత్యక్షముగా నాతో యుద్ధము చేసి ఉన్నచో నీవు నాచేత చంపబడినవాడవై, ఇప్పుడే యమధర్మరాజును చూచెడివాడవు.

        త్వయాఅ దృశ్యేన తు రణే నిహతోఅ హం దురాసద, 

        ప్రసున పన్నగేనేవ సర పానవశం గతై- కిష్కి కాంస. 17.47.

నీవు నన్ను యుద్ధములో ఎదిరింప జాలక, కనబడనివాడవై, మద్యము త్రాగి నిద్రపోవుచున్న మనుష్యుని సర్పము చంపినట్లు చంపినావు..


         సుగ్రీవప్రియకామేన యదహం నిహతస్త్వయా,

        మామేవ యది పూర్వం త్వమేతదరమచోదయ, 

        రాక్షసo చ దురాత్మానం తవ భార్యాపహారిణమ్, 

        కణి బదా ప్రదద్యాం తేలనిహతం రావణం రణే -     కిష్కి, కాం. స.17.48.49

ఏ కార్యము కొరకై సుగ్రీవునకు ప్రియము చేయదలచి నీవు చంపినావో ఆ కార్యము నిమిత్తము నన్నే ముందు ప్రేరేపించి ఉన్నచో నేను, నీ భార్యను అపహరించిన, దురాత్ముడైన రావణుని యుద్ధములో చంపకుండా మెడకు తాడు కట్టి తీసికొని వచ్చి నీకు అప్పగించెడివాడను.

        న్యస్తాం సాగరతోయే వా పాతాలే వాపి మైథిలీమ్. 

        అనయేయం తవాదేశాచ్చేతామశ్వతరీమివ-         కిష్కి,కాం. స.17.50

సీతను సముద్ర జలమధ్యమునందు దాచినా, పాతాలములో దాచినా, నీ ఆజ్ఞచే నేను ఆమెను, మధుకైటభులచే పాతాలములో నిరోధింపబడిన, ఆడ గుఱ్ఱము రూపములో ఉన్న శ్రుతిని హయగ్రీవుడు తీసికొని వచ్చినట్లు తీసికొని వచ్చి నీకు ఇచ్చి ఉండెడివాడను.

నేను స్వర్గస్తుడనైన పిమ్మట సుగ్రీవుడు రాజ్యమును పొందుట యుక్తమే. కాని నీవు నన్ను యుద్ధములో అధర్మముగా చంపుట మాత్రము యుక్తము కాదు,

    ....కాని నీవు నన్ను యుద్ధములో అధర్మముగా చంపావు. అంటూయే వాలి...

    ఈ మాటలకు రాముడు స్పందిస్తూ అంటాడు పర్వతములతోను, చిన్న వనములతోను ఉన్న భూమి అంతా ఇక్ష్వాకువంశీయులకు చెందినది. ఈ భూమిని ఇప్పుడు ధర్మాత్ముడైన భరతుడు పాలించుచున్నాడు. ఆయన సత్యమునే పలుకువాడు. వక్రత్వము లేనివాడు. ధర్మ - అర్థ -  కామముల తెలిసినవాడు. దుష్టులను నిగ్రహించుటయందు, శిష్టులను అనుగ్రహించుట యందు శ్రద్ధ కలవాడు. ఆ భరతునియందు నీతి, వినయము, స్థిరముగా ఉన్నవి. అతడు తగిన పరాక్రమము గలవాడు. దేశకాలములు తెలిసిన ధర్మ రక్షణము నిమిత్తము అతడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము, మేము, రాజులు, ధర్మము అవిచ్చిన్నముగా ఉండునట్లు చూచుటకై ఈ భూమి మీద సంచరించుచున్నాము. రాజులలో శ్రేష్ఠుడైన, ధర్మనిరతుడైన ఆ  భరతుడు ఈ పృథ్విని పాలించుచుండగా ధర్మవిరుద్ధముగా ప్రవర్తించగలడు? శ్రేష్టమైన మా  ధర్మమును పాలించుచున్న మేము భరతుని ఆజ్ఞను పురస్కరించుకొని, "ఎవరైనా ధర్మమార్గమును అతిక్రమించుచున్నారా?"అని  శాస్త్రానుసారముగా పరిశీలించి చూచుచుందుము" అని ఉత్తరం ఇచ్చాడు. (కిష్కిందకాండ 17వ సర్గ శ్లోకం 6-11)

వాలిని మోసపూరితంగా చంపడానికి రాముడు చెప్పిన కారణం -కిష్కింద కాండ 18వ సర్గ 19వ శ్లోకం చెప్పనారంభించాడు:

పాపకర్మ చేయు నీవు మహాత్ముడైన ఈ సుగ్రీవుని భార్యను నీకు కోడలివంటిదైన రుమను కామమువలన పొందినావు.

        తద్వ్యతీతస్య తే ధర్మాత్కామవృత్తస్య వానర, 

        భ్రాతృభార్యాభిమర్శే స్మిన్ దఢయం ప్రతిపాదిత   -కిష్కి, 18.20

ఓ! వానరా! అందువలన, స్వేచ్ఛగా ప్రవర్తించుచు ధర్మమును అతిక్రమించిన నీవు చేసిన ఈ సోదరుని భార్యను ఆశించుట పాపమునకు ఇవ్వబడినది.

        న హి లోకవిరుద్ధస్య లోకవృత్తాద పేయుషు, 

        దణాదన్యత్ర పశ్యామి నిగ్రహం హరియూథప. - కిష్కి 18.21

ఓ! వానరరాజా! లోకమునకు విరుద్ధముగా ప్రవర్తించుచు, లోకాచారమునకు దూరమైనవానికి దండము తప్ప మరొక ప్రాయశ్చిత్తమేదీ నాకు కనపడదు.


         న చ తే మర్పయే పాపం క్షత్రియోహం కులోద్ధత, 

        ఔరసీం భగినీం వాపి భార్యాం వాష్యనుజన్మ య, 

        ప్రచరేత నర కామాత్తస్య దణ్డో విధీయతే.     -కిష్కి, 18.22

ఉత్తమ వంశమునందు పుట్టిన క్షత్రియుడనైన నేను నీవు చేసిన ఈ పాపమును సహించజాలను, ఏ మానవుడు కామమోహితుడై, కుమార్తెను గాని భార్యను గాని పొందునో అతనికి దండము విధింపబడినది.

    ఇక్కడ చాలా లొసుగులు ఉన్నాయి. భరతుని దేశములో ఉండవలసిన సనాతన ధర్మ సూత్రాలు వానరులకు ఆపాదించడం సబబేనా?. పోనీ ఆపాదిస్తే అందరికీ సమానంగా ఆపాదించినారా అని చూస్తే ఇక్కడ కూడా వివక్ష చూపడం రామారాజ్యంలో ఉండే ఇష్టా రాజ్యానికి సూచనగా నిలుస్తుంది. ఒక వైపు సుగ్రీవుని భార్యను తీసుకున్నాడని వాలిని ధర్మబద్ధంగా చంపానని చెప్పే రాముడు ఇంకో వైపు వాలి భార్యయైన తారను అనగా సుగ్రీవుని వదినను, అతనికి భార్యగా ఎంచి మరీ లక్ష్మణుడు మాట్లాడటం చూస్తాం.


        కిమయం కామవృత్త స్తే లుప్తధర్మార్థసజ్ఞహ, 

        భర్తా భర్తృహితే యుకే న చైనమవబుద్ధ్య సే.   - కిష్కి.కా 33.43

భర్త హితమును కోరు ఓ తారా! నీ భర్త ధర్మార్ధములు సంపాదనమును చేయక కామ ప్రవృత్తితో మాత్రమే ఎందుకున్నాడు? నీవు ఈతని దోషమును గుర్తించటలేదు.

        మిత్రం హ్యర్థగుణశ్రేష్ఠం సత్యధర్మపరాయణమ్, 

        తద్ద్వయం తు పరిత్యక్తం న తు ధర్మే వ్యవస్థితమ్ -కిష్కి,కా 33,48,

సత్యమునందు, ధర్మమునందు ఆసక్తిగల మిత్రుడు అర్థవిషయములందు గుణ విషయములందు శ్రేష్ఠుడు. కాని నీ భర్త ఆ రెండింటిని విడిచినాడు. ధర్మమునందు నిలిచి ఉండలేదు.

ఒక వైపు సుగ్రీవుని భార్యను ఉంచుకున్నందుకు వాలికి శిక్ష, ఇంకో వైపు అన్న భార్య ఐన తారను ఉంచుకున్నందుకు మాత్రం ధర్మమును మీరడం కాదు అన్నట్టు సుగ్రీవుని భార్యగా తారను అభివర్ణించడం భేష్! ఏముంది కదా ఈ రామరాజ్యం? అనుభవిస్తే కాని మజా తెలియదు అన్నట్టు ఉంది.




కామెంట్‌లు