క్రైస్తవ విశ్వాసి ఎవరు? | Who is a Christian Beleiver?

క్రైస్తవ విశ్వాసి ఎవరు? | Who is a Christian?

christian believer


అపొస్తలుల కార్యములు 11:26 ప్రకారం, యేసు అనుచరులను అనగా "యేసు చెప్పినట్లు నడుచువారు" (1 యోహాను 2:6) వారిని "మొదట అంతియొకయలో క్రైస్తవులు" అని పిలిచారు. ఎఫెసీయులకు 2:8-9 ప్రకారం ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా క్రైస్తవుడు అవుతాడు, నియమాల జాబితాను లేదా మంచి పనులను అనుసరించడం ద్వారా కాదు: "మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే"

రోమా 10:9-10 ఇలా చెబుతోంది, "యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు." హృదయంలో నమ్మటం, ఆయనను రాజుగా ఒప్పుకోవడం, నాయకునిగా అనుసరించడం, ఆయన బోధలను అనుసరించి సమర్థిస్తూ, నోటితో ఆయనను మరియు ఆయన బోధలను ఒప్పుకొని ప్రకటించే జీవితం ఆయన ద్వారా రక్షింపబడిన జీవితం. నిజమైన క్రైస్తవుడు యేసు “ప్రభువు" "అధిపతి" "రాజు" "యేలినవాడు" అని చెప్పడానికి సిగ్గుపడడు మరియు “యేసు మృతులలో నుండి పునరుత్థానం "చేయబడ్డాడు" అని కూడా నమ్మి ఆయనను దేవునిగాను, తన స్వంత రక్షకునిగాను ఈలోకం మరియు పరలోకం నందు ఆయన చిత్తమును నెరవేర్చే దిశగా శ్రమించే మనసు మరియు మానసిక నిశ్చయత కలిగి ఉంటాడు. రోమా 8:9 ప్రకారం పరిశుద్ధాత్ముని చేత మనము దేవుని పిల్లల వలె ఆయన కుటుంబములోనికి చేర్చబడ్డాం అని నమ్మేవాడు క్రైస్తవుడు. తండ్రి చిత్తమును జరపాలని, ఆయన రాజ్యము వచ్చునట్టుగా ప్రార్ధించి పని చేస్తాడు. 2 కొరింధీ. 5:17 ప్రకారం నూతన సృష్టి, యాకోబు పత్రిక ప్రకారం కేవలం విశ్వాసమును పలికేవాడుగా కాకుండా పనులలో తన విశ్వాసమును ప్రదర్శించగలవాడై ఉంటాడు. అన్నింటి కంటే పైగా క్రీస్తు రాజ్యమును అన్వేషించేవాడు క్రైస్తవుడు. తాను బ్రతుకుతున్న దేశం, సంస్కృతి, భాష మొదలగు నేపథ్యాలలో ఉన్న మహిమను మోసుకుని క్రీస్తు రాజ్యంలో ప్రవేశించ కోరిక కలిగి ఉంటాడు క్రైస్తవుడు. తాను పుట్టిన సంస్కృతిని కాదని పాశ్చాత్యతను అనుసరించడం క్రైస్తవం అని కొందరు బొంకినట్టుగా కాకుండా తానున్న మరియు తనకు సంబంధించిన ప్రతి గుర్తింపును దాని వెనుక దేవుని నిత్య ప్రణాళికను అర్థం చేసుకుని కలుపుగోలుగా జీవిస్తాడు క్రైస్తవుడు. తన ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన దేవుని రాజ్య స్థాపన మరియు విస్తరణకే అంకితం అయి ఉంటుంది. కనుక దేవుని రాజ్యం గురించి కొద్దిగా అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం.


శతసహస్రభాను సమటివి వదన బిం 
బమున నాట్యమాడ నమఅతకరుని 
కిరణమాలపుష్ప సరముగా రూపాంత 
రంబబందె క్రీస్తురాజ మౌళి.
                                                                    - గుర్రం జాషువా

కామెంట్‌లు