రామరాజ్యం అంటే దొంగ మార్గాన చంపడమేనా? | రాముని కుట్రలో భాగంగా లక్ష్మణుడు చనిపోవటం | Is Ram Raj means killing in wrong way ? |

రాముని కుట్రలో భాగంగా లక్ష్మణుడు చనిపోవటం

Lakshmana's death as part of Rama's conspiracy

లవణాసురున్ని చంపేందుకు శత్రుఘ్నునికి దొంగ మార్గం నేర్పినప్పుడు "రామరాజ్యం" అంటే "దొంగ మార్గాన చంపడమే" అని దాని ప్రేరణ కూడా వాలిని సంహరించిన విధమేనని అర్థం అవుతుంది. చివరికి తనను నమ్మిన తన సొంత తమ్మున్ని ఆత్మాహత్యపాలు చేయడానికి రాముని వ్యూహం చూస్తే ఆ రాజ్యం రావాలో!! ఒద్దో తెలుస్తుంది.

        చోదితో రాజసింహేన మునిర్వాక్యమభాషత, 

        ద్వన్వై హ్యేతత్రపర్తవ్యం హితం వైయద్య పేక్షసే.  -ఉత్తర కాండ 103.12


రాముని చేత ప్రేరేపింపబడిన ఆ ముని ఇట్లు పలికెను. "నీవు హితమును కోరినచో ఇది రహస్యమునందే చెప్పదగినది. మునులలో ముఖ్యుడైన మహర్షి వచనమును నీవు మన్నించినచో మన మాటలను ఎవడు వినునో, లేదా మాటలాడుకొనుచున్న మనలను చూచునో తనిని నీవు చంపవలెను. రాముడు అట్లే అని ప్రతిజ్ఞ చేసి లక్ష్మణునితో ఇట్లు పలికెను. మహాబాహు! ద్వారపాలకుణ్ణి పంపివేసి ద్వారమునందు నిలచి ఉండుము."

        సమే వద్య ఖలు భవేద్వాచం ద్వన్వసమీరితామ్, 

        ఋషేర్మమ చ సౌమిత్రే పశ్యేద్వా శృణుయాచ్చ య.  -ఉ. 103. 15.

లక్ష్మణా! నేనూ ఈ ఋషీ రహస్యమునందు మాటలాడుకొనుచుండగా ఎవరు చూచునో లేదా వినునో అతనిని నేను చంపివేయవలసి ఉండును. రాముడు లక్ష్మణుని ద్వారమునందు రక్షకుణిగా ఉంచి అతనితో ఇట్లనెను.

rama lakshmana


         "తత్తే మనీషితం వాక్యం యేన వాసి సమాగత, 

            కథయస్వావిశస్త్వం మమాపి హృది వర్తతే."  -ఉ. 103.17

(కాలపురుషుడు రామునకు బ్రహ్మదేవుని సందేశము చెప్పుట. రాముడు అంగీకరించుట) గొప్ప బుద్ధి బలము గల రాజా! నేను ఎందుకు వచ్చితినే వినుము. గొప్ప బలము గలవాడా! నన్ను బ్రహ్మదేవుడు పంపినాడు.

    దుర్వాసుడు శపించుననే భయముచేత లక్ష్మణుడు నియమ భంగమైనను లెక్కచేయక రాముని దగ్గరకు వచ్చి అతని రాకను గూర్చి చెప్పుట. రాముడు దుర్వాసునకు భోజనము పెట్టుట. అతడు వెళ్లిపోయిన పిమ్మట రామునకు లక్ష్మణుని విషయమున చింత కలుగుట.

    ఆ రాముడు కాలపురుషుడు ఈ విధముగా సంభాషణ చేయుచుండగా పూజ్యుడైన దుర్వాసముని రాముని దర్శనమును ఆ రాజద్వారము వద్దకు వచ్చెను. ఆ మహాముని లక్ష్మణుని "శీఘ్రముగా, చూపుము;  కానిచో నా కార్యము మించిపోవును" అని పలికెను. శత్రు వీరసంహరకుడైన లక్ష్మణుడు ఆ ముని మాటలు విని, మహాత్ముడైన అతనికి నమస్కరించి ఇట్లు పలికెను. పూజ్యుడా! ఏమి పనో చెప్పుము. ఏ ప్రయోజనమునకై వచ్చినావు?  ఏమి చేయుదును? బ్రాహ్మణా! రాముడు పని తొందరలో ఉన్నాడు. నేను నీకు ఏమి చేయు ఒక్క నిమిష మాత్రము నిరీక్షించుము."

    ఆ మునిశ్రేష్టుడు ఆ మాట విని కోపావేశము పొంది లక్ష్మణుడిని చూపుతో కాల్చివేయుచున్నాడా అన్నట్లు చూచుచూ, ఇట్లు పలికెను. "లక్ష్మణా” నన్ను గూర్చి రామునకు ఈ క్షణమునందే తెలుపుము. అట్లు చేయకపోయినచో ఈ దేశమును, నిన్ను, రామున్ని, భరతున్ని, మీ సంతానమును కూడ శపించెదను. నేను నా కోపమును మనస్సులో అణచుకొనజాలను."

    మహా ప్రభావవంతుడైన ఆ మునీశ్వరుని భయంకరమైన ఆ వాక్యమును వినిన లక్ష్మణుడు ఆ వాక్యము విషయమున చేయవలసిన నిర్ణయమును గూర్చి ఆలోచించెను. "నాకు ఒక్కనికే మరణము వచ్చుగాక! అందరికి వినాశము రాకుండు గాక!" అని మనస్సులో నిశ్చయించుకొని, లక్ష్మణుడు రామునకు అతనిని గూర్చి తెలిపెను. ఈ రాజైన రాముడు లక్ష్మణుని మాటలు విని, కాలపురుషుణ్ణి పంపివేసి, తొందరపడుచు బైటకు వచ్చి దుర్వాసుణ్ణి చూచెను.

ఈ మొత్తం ప్రకరణంలో లక్ష్మణుడు కేవలం రాముని కుట్ర లేక వ్యూహంలో భాగంగానే చనిపోయినట్టు అవగతం అవుతోంది. అసలు లక్ష్మణుడి ద్వార పాలకునిగా నియమించాల్సిన పని ఏమిటి? దుర్వాసుని రాక తెలిసిన రాముడు, అతని కోపాగ్ని గురించి పరిచితుడైన రాముడు, కాల పురుషునికి మాట ఇచ్చి మరీ లక్ష్మణుడిని ఈ పరిస్థితిలో ఇరికించడం ఎంత వరకు సమంజసం? బ్రాహ్మణ ఆధిపత్యమే రామరాజ్యం! కాదంటారా? ఇంతవరకు చూసిన రుజువులు ఆ దిశగా అర్థం అవడం లేదంటారా?


కామెంట్‌లు