శంబూకుని వధ - శూద్ర వంచన, మోసం Slaughter of Shambhuka - Decepetion by Rama to shudra

 రాముడు శంబూకుని తల నరకటo - శూద్ర వంచన, మోసం

శ్రీరాముడు తన రాజ్యం విజయ విహారం జరుపుకుంటున్న సమయంలో తన సంతోష ఘడియలలో ద్వార పాలకుణ్ణి అడిగాడు, "ఈ శుభ సందర్భంగా ఈ ఆక్రందన ఎలా వినిపిస్తోంది?" "మహారాజా! తన కొడుకు మృతదేహాన్ని మోస్తున్న బ్రాహ్మణుడు అతని ఛాతీని బాధుకుంటూ అనంతమైన శోకంతో కొట్టుమిట్టాడుతు సంతాపం వ్యక్తం చేస్తున్నాడు. అతని కుమారుడు చిన్న వయసులోనే మరణించాడు..., మహారాజా! అతను కోపంగా మరియు అర్థంలేని విధంగా తన కొడుకును మహారాజే చంపాడని ప్రకటించుచున్నాడు... అని చెప్పాడు. అందరూ నివ్వెరపోయారు. కోపంతో శ్రీ రాముని ముఖం రగిలిపోయింది. కొడుకు మృతదేహాన్ని ఛాతీకి దగ్గరగా పట్టుకొని రాముడి ముందు నిలబడ్డాడు బ్రాహ్మణుడు. అతని కళ్ళు స్థిరంగా ఉన్నాయి మరియు అతని నోరు నురుగుతో నిండి ఉంది.

Rama slaughters shambuka


"రామా! నువ్వు నా కొడుకు హంతకుడవు. ఇప్పటి వరకు, తన తండ్రి జీవించి ఉండగా ఏ కొడుకు కూడా చనిపోలేదు. నీ రాజ్యములో పాపాలు మరియు అన్యాయాలు వర్షాకాలంలో వరిపొలాల వలె వృద్ధి చెందుతున్నాయి... ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు, అన్యాయం నీ రాజ్యంలో జరుగుతున్నాయి. ఇది మరణం కాదు, ఇది హత్య" అని చెప్పాడు. ఇక్కడ కూడా బ్రాహ్మణ పెత్తనమే. బ్రాహ్మణులు చేసే ఏమోషనల్ బ్లాక్ మెయిల్ తప్ప ఇంకేదైనా ఇక్కడ కనిపిస్తోందా?

Brahmin vs rama


ఇలాంటి అవాంఛనీయ సంఘటన సత్యయుగంలో ఎప్పుడూ జరగలేదు. కృత మరియు త్రేతా యుగాలలో మొదట బ్రాహ్మణులు తరువాత బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే తపస్సు చేసేవారు. కృతయుగంలో వీర్యం చేత మరియు తపస్సు చేత కూడా బ్రాహ్మణులే అధికులు, త్రేతాయుగంలో మను పుత్రులైన క్షత్రియులు కూడా వీర్యము చేత మరియు తపస్సు చేత మహాత్ములు కానీ నిత్యనైమిత్తి కాది కర్మలే కాక కాయక్లేస  రూపమైన తపస్సు కూడా చేసే వారు కాబట్టి బ్రాహ్మణులే క్షత్రియులకన్నా అధికులు. అయినప్పటికీ త్రేతా యుగములో తపో వీర్యము చేత రెండు జాతులు సమానమైన కారణాన శాస్త్ర నిర్మాతలు బ్రాహ్మణ క్షత్రియులలో భేదము అధికంగా లేనందున అందరికీ సమ్మతమైన చాతుర్వర్ణ్యం ఏర్పాటు చేసారు. త్రేతా యుగంలో బ్రాహ్మణ క్షత్రియులు తపస్సు చేసారు గనుక వైశ్య శూద్రులు శుశ్రూష రూప ధర్మమును చేయాలి, విశేషించి శూద్రులు సమస్త వర్ణముల పూజను చేసిరి. ద్వాపర యుగాన అధర్మము రెండవ కాలు మోపిన కారణాన వైశ్యులు కూడా తపస్సు. చేసిరి. కానీ శూద్రునికి మాత్రం తపస్సు లభ్యం కాదు.

      హీన వర్లో నృప శ్రేష్ఠ తప్పుతే న హి పై తప 

       భావినీ శూద్ర యోన్యాం తు తపస్సర్యా కలా                 యుగే - ఉత్త 74.27

"హీన వర్ణునికి తపస్సు నిషేధము. కలియుగంలో వారికి కూడా తపస్సు లభ్యం అవ్వొచ్చు. కనుక రాజా నీ దేశమందు దుర్బుద్ధి అయిన గొప్ప తపస్సు చేసే శూద్రుడు ఉన్నందువల్లే ఈ బ్రాహ్మణ పిల్లవాడు మరణించాడు" అని నారదుడు చెబుతాడు. దుర్మతి అయిన ఏ నరుడైనా రాజ్యమందు అధర్మమును కానీ, చేయకూడని పనిని కానీ చేసినచో అది అలక్ష్మిని కలిగించును. ఆ రాజు కూడా వెంటనే నరకములలో పడును. రాజుకు రాజ్యంలోని పుణ్య కార్యాలలో, తపస్సులో ఆరవ వంతు కలుగును కనుక రాజ్యమంతా వెదికి అధర్మమును కనిపెట్టి ధర్మవృద్ధి, మానవులకు ఆయుర్వృద్ధి కలుగజేయుము” అని నారదుడు హితబోధ చేస్తాడు. ఇందులో హితబోధ ఉందా? లేక మానసిక బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఉన్నాయా?” అన్నది చదువరులకే వదిలేస్తాను. శూద్రుడు తపస్సు చేయడం దుర్బుద్ధి అయితే ఆ రామరాజ్యం ఈనాడు వస్తే మనగతి ఏమిటి అన్నది చదువరులకే వదిలేస్తాను.

ఇక రాముడు విమానమెక్కి ఎవరు తపస్సు చేస్తున్నారో వెదకడానికి బయలుదేరాడు. హిమవత్పర్వతము అనగా ఉత్తర దిక్కు, మరియు తూర్పు దిక్కుకు వెళ్లి చూసి, అక్కడ ఎవరు కనబడక పోయేసరికి దక్షిణ దిక్కుకు అనగా దక్షిణ భారతదేశము వైపుకు వెళ్లి వెదకడం మొదలు పెట్టాడు. "ఇక్కడ దక్షిణాన ఉన్నవారిని హీన జన్మములుగా లేక శూద్ర జాతులుగా వారిని నిలువరించడానికి ఆర్య పన్నాగం ఇలా కథా రూపంగా చెప్పబడుతోంది. అని చెప్పేవారు లేకపోలేదు. దక్షిణ భాగాన క్రిందికి ముఖము ఉన్నట్టుగా వ్రేలాడుతూ తపస్సు చేస్తున్న ఒక మునిని రాముడు చూసాడు. అతని వద్దకు రాముడు వెళ్లి, “ఉత్తమమైన నియమము కలవాడా! నీవు ధన్యుడవు" అని పలకరించాడు. మర్యాదకు చిరునామా అయిన రాముడు మునిని చూసి మర్యాద ఇవ్వడం బాగుంది. "తపస్సు చేత వృద్ధుడవైన ఓ మునీంద్రా! నీది ఏ కులం?" అని అడిగాడు, అది కూడా "కుతూహలం చేత నేను నిన్ను అడుగుతున్నాను" అని కూడా చెప్పాడు... 

అంటే ఆయన కేవలం ముని మాత్రమే కాదు వృద్ధుడు కూడా, మరియు రాముని కుతూహలం ఎప్పుడు, ఎవరిది, ఏ కులము? అని తెలుసు కోవడమే. రాముడు అతనిని అడుగుతూ. "ఎవరు చేయజాలని తపస్సు చేస్తున్నావు, మరి నీవు పొందదలచిన ప్రయోజనము స్వర్గమా లేకా ఇంకేదైనానా? అసలు నీవు బ్రాహ్మణుడివా? క్షత్రియునివా? వైష్యునివా లేక శూద్రునివా? సత్యం చెప్పు" అని అడిగాడు. రాముని మాటలు విని తలక్రిందులుగానే ఉన్న ఆ ముని "నేను శూద్రజాతిలో పుట్టిన వాడను, శరీరముతోనే దేవత్వం పొందుటకై తపస్సు చేస్తున్నాను. నేను అసత్యం చెప్పడం లేదు. దేవ లోకాన్ని జయించడానికి కోరిక కలిగి ఉన్నాను, నా పేరు శంభూకుడు" అని అన్నాడు. అతడు అలా చెబుతూ ఉండగానే ధగ ధగలాడు ఖడ్గంతో అతని తల ఖండించాడు రాముడు. ఆ తరువాత ఇంద్రాగ్నులు రామున్ని ఆ పని చేసినందుకు చాలా ప్రశంసించారు. ఇలా ప్రార్ధన, ఆరాధన, ఆధ్యాత్మికతకు కూడా కులాన్ని అంటగట్టి వారు ఆడిందల్లా ఆట అన్నట్టు రాముడి వంటి వాళ్ళను ఆడించి మభ్య పెట్టి బూచిని చూపించి బహుజనులపై అరాచకం అమానుషం చేయడమే రామ రాజ్యమా?

Rama killed Shambuka


యేసు క్రీస్తుగా అనగా మెస్సియా లేక అభిషిక్తుడైన రాజుగా ఈలోకానికి వచ్చిన దినాలలో ఇలాంటి పోకడలే ఇశ్రాయేలు సమాజం వారు చేస్తూ ఉండే వారు. మత ఆచారాలకు పెద్దపీట వేసి దేవుని రాజ్య సంస్కృతిని, ప్రపంచముకు వెలుగుగా ఉండటానికి ఉంచబడిన దీపపు స్థంబము అన్న స్పృహ కోల్పోయిన యూదా సమాజం నిష్టా గరిష్టలతో మనిషిని మనిషినుంది వేరు చేయడానికి వారి ఆచారాలను ఒక ఆయుధంగా వాడుకున్నట్టు మనం చూస్తాం. అసలు ఇశ్రాయేలును రాజ్యంగా దేవుడు ఎన్నుకోవడం వెనుక ఉన్న నేపధ్యం ఏమిటి? అంత చిన్న జనాంగాన్ని ఆయన ఎన్నుకుని వారి పై రాజుగా ఉండటం వెనుక దేవుని ప్రణాళిక ఏమిటి? అని ఆలోచిస్తే బైబిల్ చెప్పే స్పష్టమైన వచనాలు. మనకు ఆ ప్రణాళిక ను తెలియజేస్తున్నాయి.

Woman washing Jesus feet


యేసు శరీరధారియై ఉన్నప్పుడు మనుష్యుల నడుమ ఉన్న సామాజిక రుగ్మతలను సవాలు చేసాడు. ఒక వేశ్య వచ్చి యేసు ఉన్న ఇంటిలోకి వచ్చి అందరూ చూస్తు ఉండగా ఆయనను తాకేంత స్వాతంత్య్రాన్ని ఆయన పాపులుగా పిలువబడే వాళ్లకు ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. తాకడం మాత్రమే కాదు, అత్తరు ఆయన కాళ్ళ పై పోసి కన్నీటితో ఆయన కాళ్ళు కడిగే కార్యక్రమం ద్వారా కురులతో వాటిని తుడవటం ద్వారా, తన భక్తిని చాటి చెప్పింది. ఏ సమాజం అయితే ఇటువంటి వారిని తాకడానికి కూడా ఒప్పుకోలేదో! అటు వంటి సమాజంలో ఆ స్త్రీతో బాహాటంగా అభిమానాన్ని స్వీకరించాడు యేసు. ఏ స్త్రీలనైతే కుక్కలకంటే తక్కువగా యూదా సమాజం చూసిందో అలాంటి వారిని శిష్యులుగా ఎన్నుకున్నాడు యేసు. ఏ సమరయులనైతే తాకడానికి కూడా యూదులు ఇష్ట పడలేదో అందులోనూ ఆ సమాజంలోని స్త్రీతో కూడా సంభాషించి మరీ వారి మధ్య అడ్డు గోడలను కూల్చివేశాడు. వేతనాలలో సమానత్వం పాటించి శ్రమ గౌరవాన్ని పెంచాడు, సుంకరులతో కూర్చుని బొంచేసి దేవుని రాజ్యము అనగా తీర్పు తీర్చడం కాదు సరిచేయడం, చక్క బెట్టడం, దేవునితో సమాధాన పరిచే పరిచర్య అని చాటి చెప్పాడు మన ప్రభువు. ఈ రాజ్యానికి పైన వివరించిన రాజ్యానికి పొంతన ఉందంటారా?

కానన తుల్య సమాజములో - హీనత జెందెను మానవత మానవ మైత్రిని సిల్వా పతాకము - దానము జేసిగదా దేవుని బానిస లోకములో - చావుయే కాపురముండే గదా దేవునితో సఖ్యంబును జగతికి - ఈవి నిదితివి గదా.. సిల్వధరా..


          -ఏ బీ మాసిలామణి 307 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.


కామెంట్‌లు