రామరాజ్యంలో స్త్రీ | Woman in Rama Rajyam | రామరాజ్యంలో సీత పరిస్థితి!

రామరాజ్యంలో స్త్రీ

ఇక రావణుడి చేతిలోనుండి విడిపింపబడిన సీత దుఃఖములో ఉంటే రాముడు ఏ విధంగా తన భార్యతో వ్యవహరించాడు అన్నది చూస్తే రామ రాజ్యంలో ఇలాంటివి చూడవలసి వస్తుందని ముందే తెలుసుకోగలం.

        పశృతస్తాం తు రామన్న సమీపే హృదయప్రియామ్, 

        జనవాదభయద్రాజ్ఞో బధూన హృదయం ద్విధా - యుద్ధ.కాండ. 115. 11

తన హృదయమునకు ప్రియురాలైన, సమీపమునందే నిలిచి ఉన్న సీతను చూచుచున్న ఆ రాజైన రాముని హృదయము జనాపవాద భయముచేత రెండు విధములుగా ఉండెను.

నల్లకలువ రేకుల వంటి నేత్రములు, నల్లని వక్రములైన కేశములు, (శేషమైన కటిప్రదేశము గల సీతతో, వానరులయొక్క రాక్షసులయొక్క మధ్యయందు రాముడిట్లు పలికెను. గౌరవమును కోరిన నేను రావణుని సంహరించి, అవమానమును తొలగించుకొనకోరు. మానవుడు ఏమి చేయునో ఆది చేసితిని.

        విదితశాస్తు భద్రం తే యోలయం రణపరిశ్రమ, 

        సుతీర్ల: సుహృదాం వీర్యాన్న త్వరర్థం మయా 

        కృత రక్షతా తు మయా వృత్తమపవాదం చ 

        సర్వత, ప్రఖ్యాతస్మాత్మవంశస్య నృఙ్గం చ 

        పరిమాగతా, - యుద్ధ కాండ. 111.15,16

ఏ యుద్ధపరిశ్రమను నేను. స్నేహితులు పరాక్రమముచేత దాటగలిగితినో అట్టి ఈ యుద్ధపరిశ్రమను నేను నీ కొరకై చేయలేదను విషయమును గ్రహింపుము. నా చరిత్రను రక్షించుకొనుటకు, అన్ని వైపులనుండి లోకాపవాదము రాకుండా చేసికొనుటకు, ప్రసిద్ధమైన నా వంశము కళంకమున తుడిచివేయుటకు నేను ఈ పరిశ్రమ చేసితిని. నీకు క్షేమమగుగాక.

    సత్కులమందు పుట్టిన తేజశాలియైన ఏ పురుషుడైన పరగృహముల ఉన్న స్త్రీని అత్యాసక్తితో కూడిన మనస్సుతో మరల తీసికొనునా!

woman in rama raj -sita


        రావణఙ్క  పరిక్లిష్టం దృష్టాం దుషైన చక్షుషా, 

        కథం త్వాం పునరాదద్యాం కులం వ్యపదిశన్ మహల్. - - యుద్ధ. 11.52

రావణుని ఒడిలో నలిగినదానవు, దుష్టమైన చూపులతో చూడబడినదానవు అయిన నిన్ను, గొప్ప కులములో పుట్టినానని చెప్పుకొనుచునే నెట్లు మరు గ్రహించగలను!

         తదర్థం నిర్జితా మే త్వం యశ ప్రత్యాహృతం మయా, 

          నాస్తి మే త్వయ్యభిష్వాజ్గో యథేష్టం గమ్యతామితై. - యుద్ధ. 115.21

నేను నా కులము గౌరవము కాపాడుటకే నిన్ను జయించితిని. కీర్తిని మరల సంపాదించితిని. నీయందు నాకు ఆసక్తి లేదు. అందుచేత ఇక్కడినుండి నీ కిష్టము వచ్చిన చోటికి వెళ్లవచ్చును ఓ! మంగళప్రదురాలా! అందుచేత నేను నిర్ణయము చేసికొనియే ఈ మాటలు చెప్పుచున్నాను. నీ ఇష్టము ప్రకారము లక్ష్మణుని సంరక్షణములో కాని, భరతుని సంరక్షణములో కాని ఉండుటకు నిశ్చయించుకొనుము. సీతా! శత్రుఘుని సంంక్షణములో గాని, సుగ్రీవుని సంరక్షణములో గాని, రాక్షసుడైన విభీషణుని సంరక్షణములో గాని ఉండుటకు నిశ్చయించుకొనుము. లేదా నీ కిష్టము వచ్చినట్లు చేయుము.

crying sita


        తత్ ప్రియార్షశ్రవణా తదప్రియం

        ప్రియాదుపశ్రుత్య చిరస్య మైథిలీ, 

        ముమోచ బాష్పం సుభృశం ప్రవేపితా 

        గణేభ్రహస్తాభిహతేవ వల్లరీ. - యుద్ధ. 111.25

అప్పుడు ప్రియమైన మాటలు వినుటకు తగిన ఆ సీత ప్రియుని నుండి అప్రియమైన ఆ మాట విని, ఏనుగు తొండముచేత కదల్చబడిన లత వలె చాలా సేపు మిక్కిలి వణకిపోయి కన్నీరు విడచెను.


    ఇలా రామరాజ్యంలో రాముని వంటి రాజు స్త్రీ మూర్తి అయిన సీత తన మిక్కిలి ఉదాసీన సమయంలో రామునిచే న్యాయం పొందలేని పరిస్థితి..

దానికి తత్కారణం తన ప్రియుడైన రాముడు బాధ్యతారహితంగా సురాసురులు మధ్యలో నిలిచి దేవతల సమక్షంలో ఆమెను కేవలం తన కుల ప్రతిష్ట కోసం మాత్రమే జయించాడని, తన కీర్తి ప్రతిష్టలను తిరిగి సంపాదించడం కోసమే యుద్ధం చేసాడని, తనను తిరిగి చేర్చుకోలేడని ఆమె ఇష్టం వచ్చిన వారి వద్దకు వెళ్లి వారితో ఉండవచ్చని స్వయంగా రాముడే చెప్పడం విన్న సీత పరిస్థితి. ఎలా ఉంటుందో ఆలోచించగలం, వాలిని శిక్షించడానికి సుగ్రీవుని భార్యను వాడు కోవడం, సుగ్రీవుని మందలించడానికి వాలి భార్యను వాడుకోవడం, తన అనుమానాన్ని బలపరచుకునేందుకు సొంత భార్యను కారణంగా వాడుకోవడం, ఇదే రామరాజ్యం.

 ఇదే భావి భారతంలో మనువాదులు కోరుకునే మానవ కళ్యాణార్థం స్థాపించబడే రామరాజ్యం. రావణుని ఇంట్లో ఉంటే సీత తన అందం కారణంగా రావణుని చేతిలో నలిగి ఉంటుంది అని అనుకున్న రాముడు సీతను స్వయంగా తన చేతుల మీదుగా తన తమ్ముళ్ల యొద్దకు లేక సుగ్రీవుని యొద్దకు, లేక విభీషణుని యొద్దకు వెళ్ళమని ఎలా చెబుతాడు? సుగ్రీవుని సంరక్షణలో ఉన్న వాలి భార్య తారను లక్ష్మణుడు "నీ భర్త అయిన సుగ్రీవుడు" అని సంబోధిస్తే ఒక వేళ రాముని మాట విని సీత వీరిలో ఏ ఒక్కరి సంరక్షణలోనికి వెళ్ళినా ఎవరి భార్యగా ఉండవలసి వస్తుంది? ఇక్కడ రాముని నుండి నేర్చుకోవలసిన మహోన్నతమైన పాఠం ఏమిటో? ఈ దేశంలో రామరాజ్యం వస్తే ఇలా చెయ్యాలనా? వేచి చూద్దాం.

    

                    అక్కరకు రాని చుట్టము.

        మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా 

                    నెక్కిన బాఱని గుణము 

        గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!


కామెంట్‌లు