పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

స్వరాజ్యం - రామ రాజ్యం | SvaRajyam - Rama Rajyam

చిత్రం
స్వరాజ్యం - రామ రాజ్యం | Self kingdom - Kingdom of Rama  ' జై శ్రీరాం ' అనే కేకలు ఈ రోజు దేశమంతా వినిపిస్తున్నాయి. భక్తితో కూడిన పలుకులు అందరూ ఆహ్వానిస్తారు. కానీ మతోన్మాద దురహంకార ధోరణితో చాతుర్వర్ణ రాజ్యమును దానిలో బహుజనుల అణిచివేతను ప్రతిబింబించేలా ఈ కేకలు ప్రజల మనస్సులో కక్షను, కోపాన్ని, కొన్ని సమాజాలపై విద్వేషాన్ని రెచ్చ గొట్టే విధంగా ఉండటం రామ రాజ్య స్వభావానికి అద్దం పడుతునాయి. బహుజన మైనారిటీ ప్రజలను రెండవ శ్రేణి ప్రజలుగా అణచివేతకు గురిచేసి తిరిగి పేష్వాల రాజ్యాన్ని స్థాపించే బ్రాహ్మణవాద అజెండాయే ఈ రామ రాజ్య అజెండా, నా చిన్నతనంలో హనుమంతుడు అంటే బలానికి, దీనత్వానికి, నమ్మకత్వానికి ప్రతీకగా ప్రజలు చెప్పడం నేను విన్నాను. కానీ బజరంగ్ దళ్ పేరట శూద్ర యువకులను బ్రాహ్మణ భావ జాలానికి పావులుగా వాడుకుంటూ వారి బహుజన బలాన్ని దేశ విచ్చిన్నం కోసం వాడే బ్రాహ్మణ భావజాలానికి బలి అయిపోయిన గిరిజన, బహుజన నాయకుడుగా, కోపానికి, రౌద్రానికి, మారణహెరామానికి చిహ్నంగా హనుమంతుడు రోజు రోజుకీ, ప్రజలను భయ భ్రాంతులను చేయడానికి వాడుకునే ప్రతీక అని ఇప్పుడు అర్థం అవుతోంది. ఈ రకం హనుమంతుని నమ్మకత్వం, విశ్వాస్...

స్వరాజ్యం - దేవుని రాజ్యం | Self-Kingdom- the kingdom of God

చిత్రం
స్వరాజ్యం - దేవుని రాజ్యం | Self Kingdom - The Kingdom of God యేసు క్రీస్తు రాజుగా ఆయన పరిపాలన క్రింద సుభిక్షంగా. ఆ రాజ్య విలువలతో బ్రతకాల్సిన మనుష్యులు ఆయనకు విశ్వాస్యత చూపక తమ మానవ కల్పిత నిమ్న జీవన శైలిని నిజ మూల్యముగా ఊహించుకుని దానికి సాంస్కృతిక నేపథ్యాన్ని జోడించి అదే నిత్యమైన సత్యమన్న భ్రాంతికి లోనై వారి వారి స్వరాజ్యాలను నిర్మించుకున్నారు. భారత దేశంలో మనువాదం పేరట మారణహెూమం, అరాచకం, కొందరికే సామాజిక మరియు అన్ని రంగాల అర్హతలు కేటాయించి, బహు జనులను అదిమి ఉంచే బానిసత్వం కంటే భయంకరమైన రాజ్యం నడుస్తూ ఉండేది. మరో పక్క భారతీయుల వలె ప్రపంచంలోని ఆయా సొంత రాజ్యాల పైన విస్తారవాదం పేరిట ఆక్రమణ దారులుగా క్రయ విక్రయాల పేరిట రాజ్యాలను కొల్లగొట్టే ఇంకో భయంకరమైన శ్వేత సౌద సామ్రాజ్యం ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో భారతీయులపై రాజ్యం చేసేది. రెండూ దేవుని రాజ్య విలువలకు దూరంగా సామాన్యులను అదిమి వేసి, న్యాయం జరగనివ్వకుండా, విద్య రానివ్వకుండా, గౌరవం కొందరికి మాత్రమే దక్కే సొత్తు లాగా విజృంభించే రోజులు అవి. ఈస్ట్ ఇండియా రాజ్యం బ్రాహ్మణ రాజ్యానికి వత్తాసు పలుకుతూ భారత దేశంలో స్థిరపడి పోతూ ఉంటె, ఆ శ్వేత సౌద...

యెజెబెలును ఎదిరించడం బయలు ప్రవక్తలను పారద్రోలడం | Opposing Jezebel and overthrowing the prophets of Baal

చిత్రం
యెజెబెలును ఎదిరించడం బయలు ప్రవక్తలను పారద్రోలడం " అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవుండనిచ్చుచున్నావు.. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకుబోధించుచు వారిని మోసపరచుచున్నది . ప్రకటన 2:20 ప్రవక్తల పరిచర్య ఏలీయా యెజెబెలును ఎదిరించిన రీతిలో సంఘము నుండి జారత్వపు ఆత్మను విగ్రహార్పితములు  తనలో ఇముడ్చుకునే వైఖరిని పారద్రోలాలి. దేవుని రాజ్యములో ఆయన రాజ్య ప్రతినిధులు ఆయన నియమాల చొప్పున జరిగించవలసిన అనేక విధులు యెజెబెలు తన ప్రవక్తలు ద్వారా తన ఇష్టానుసారం అష్టారోతు మరియు అషేరా దేవతలకు చేయిస్తూ వస్తుంది. " అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఏలీయాజరు కుమారుడునైన ఫీనెహాసు. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోసము. రగులుకొనేను."  ( సంఖ్యాకాం. 25:1-3 ) ఈ...

విధేయతే రాజ్యాధికార మార్గం | Obedience is the path to statehood

చిత్రం
విధేయతే రాజ్యాధికార మార్గం | Obedience is the path to statehood మానవులు దేవుడనుగ్రహించే మహిమకు దూరం కావడానికి గల ఏకైక కారణం మానవుడు స్వచ్ఛందంగా దేవుని తండ్రి వంటి అధిపత్యాన్ని కాదనుకుని శత్రువైన అవవారికి లోబడే నిర్ణయం తీసుకోవడం, అదే ఆజ్ఞాతిక్రమం దాన్నే పాపం అంటారు. ఈ అవిధేయతకు పర్యవసానమ మనపై స్వచ్ఛందంగా మనం కోరుకున్న సాతాను అధికారం. అవిధేయత రాజ్యాధికారం తెచ్చిపెడుతుంది అనుకున్న మానవ కల్పన లేక తిరుగుబాటు ప్రేమపూర్వక ప్రాతినిధ్యాన్ని కోల్పోయేలా చేసింది. ఉన్న ప్రాతినిధ్యం కాస్తా కోల్పోయిన మానవుడు చచ్చిన స్థితి లేక దైవరాహిత్యం అనే స్థితికి దిగజారి సాతాను అధికారం క్రింద వాడి రాజ్య విలువలు అయిన సిగ్గు పరచబడటం, చిన్న చూపు, నిందారోపణ, స్వార్థం వంటి ప్రతికూల విలువలతో తన మానవ మనుగడను చస్తూ రావడానికి పరిస్థితి నుండి తనను తాను విడిపించు కోలేని పరిస్థితిలో ఉన్న మానవునికి మానవ రూపంలో అవిధేయత పై జయం సాధించడానికి విధేయుడై వచ్చాడు మానవ జాతి ఉద్ధరణకు తన జీవితాన్ని సైతం పానార్పణంగా పోసిన యేసు నాథుడు.   " మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును.. అయినను ఆదాము చేసిన అతిక్రమమ...

నేటి సంఘ స్థితి | Present situation of Church

చిత్రం
నేటి సంఘ స్థితి | current situation in Churches కానీ క్రీస్తు రక్తముచేత కొనబడిన సంఘము మాత్రం తుచ్చమైన వాటి. మాయలోపడి పరిశుద్ధులకు సైతం తీర్పు తీర్చే స్థాయిలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి సంఘములో చీలికలకు వివక్షకు, విఘటనకు కారణమయ్యే భావజాలమైన అధికార దాహం, అహం, ఈర్ష్యతో కూడిన ఎత్తుగడలు, లింగ, ప్రాంత, కుల వివక్షలకు తావిచ్చి సంఘాన్ని, దేవుని రాజ్యాన్ని చిన్నాభిన్నం చేస్తున్నట్టుగా ఈరోజు కనిపిస్తోంది. "అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైనను, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి .  (1 కొరింథీ 6:9-11 ) దేవుని రాజ్యానికి పునాది అయిన దేవుని సంఘములో అనీతిమంతులు రాజ్యాధికారం కొనసాగేలా దిగజారిన సంస్కృతిని పెంచి, పోషిస్తున్నాయి. విశ్వాస సమూహాలు, కోర్టులకెక్కి తమ అధికా...

ఏలీయాను పోలిన సాహసోపేత పరిచర్య - దేవుని రాజ్య ప్రాతినిధ్యం | Courageous ministry similar to that of Elijah represented God's Kingdom

చిత్రం
ఏలీయాను పోలిన సాహసోపేత పరిచర్య దేవుని రాజ్య ప్రాతినిధ్యం  "యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లలకు హృదయములను తండ్రులు తట్టును త్రిప్పును." - మలాకి 4:5-6 ప్రవక్తల పనులలో అతి ప్రాముఖ్యమైన పని తండ్రుల హృదయములను పిల్లలు తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పుట, దేవుని రాజ్య ప్రతినిధులమైన మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పరిచర్య అని చెప్పాలి. సంబంధాల పునరుద్ధరణ దేవుని రాజ్య మూలాలలో చాలా ప్రాముఖ్యమైనదని అది ఏలీయాని పోలిన దేవుని రాజ్య ప్రతినిధిగా మనం అలవరచు కోవలసినదని వాక్యం మనకు గుర్తు చేస్తోంది. పై ప్రవచనం బాప్తిస్మమిచ్చు యోహానుకు సంబందించినదే అయినా ఆ నియమం మాత్రం మనకు కూడా ఆపాదించుకునే అవకాశం ఉంది. 1 రాజులు 17  వ అధ్యాయంలో ఏలీయా యొక్క జీవన విధానాన్ని మనం చూడగలం. దేవునికి ప్రజలకు నడుమ యేర్పడిన సంబంధ అగాధాన్ని నివారించడానికి దేవుడు తనను యెన్నుకుని ఆహాబు రాజును అతని రాజ్యాన్ని దేవుని రాజ్య పరిధిలోనికి తీసుకు రావడానికి సంబంధించిన మరమత్తుకు పూనుకు...

హిందుత్వకు హిందూ మతానికి ఉన్న వ్యత్యాసం. | hindutva & hinduism both are not same

చిత్రం
  హిందూత్వ మరియు హిందూ మతం రెండు ఒకటి కావు. | hindutva & hinduism both are not same విశ్వాసం విశ్వమంతా ఉంటుంది. సంస్కృతి ఒక భూభాగానికి పరిమితమై ఉంటుంది. ఇది సామాన్య స్పృహ. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ విశ్వాసాలను, సంస్కృతులను కలబోసి మాట్లాడటం అలవాటైపోయింది. ముఖ్యంగా " భారతదేశంలో సంస్కృతికి, విశ్వాసానికి తేడా లేనే లేదు అన్న భావనను ఒక ప్రణాళికా బద్ధంగా భారతీయుల హృదయాలలోకి బలవంతంగానే నెట్టుతున్నారు " అని అనిపిస్తోంది.  విశ్వాసం, ప్రేమ, సహోదరభావం, సమానత, పరస్పర గౌరవంలాంటి అమలు చేయగల, అనుభవించగల, అదృశ్యమైన, వైశ్విక సత్యాలు సాంస్కృతిక నేపథ్యానికి మాత్రమే ఆగిపోక సరిహద్దులు ఏవీ లేక విశ్వవ్యాప్తంగా మానవాళి నిస్టరంగా ఒప్పుకునే అంశాలు. ఇవి ఎగుమతి, దిగుమతులకు ఆవల ఉన్న మానవ విలువలు. ఏ దేశంలోనో పుడితే వస్తాయన్న గ్యారెంటీ లేదు, ఏ దేశంలోనో ఉంటె అమలు చేయకూడదన్న నియమమూ లేదు. సర్వమానవాళికి నైతికత, తర్కం, ఆలోచన, భావనలు మొదలైనవి జన్మసిద్ధంగా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో నైతికత మరియు విశ్వాసంలాంటి విశ్వ మానవ విలువలు కూడా సాంస్కృతిక మరియు మతపరమైన నేపథ్యంలో ప్రజలకు నూరి పోస్తున్నారు. ఏ మతమైనా, ఏ కు...

దేవుని రాజ్యం పట్ల అవగాహన ! | Understanding the Kingdom of God!

చిత్రం
 దేవుని రాజ్యం పట్ల అవగాహన | Understanding the Kingdom of God! దేవుడు తన ప్రణాళికలో అంతర్భాగంగాను మరియు తన ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యంగాను కలిగియున్న అతి ప్రాముఖ్యమైన అంశం ఆయన రాజ్యం, లేక కుటుంబం. తనను తాను కుటుంబంగా పరిచయం చేసుకున్న త్రియేక దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసుకున్న మానవాళి కూడా తన కుటుంబంలో భాగం అవ్వాలని, దేవుని రాజ్యమన్న పేరుతో నిత్యం విలసిల్లాలని, అయితే తన ప్రణాళికలో భాగంగా, పతనావస్థకు చేరుతాడన్న మానవుని విమోచన కొరకు తన స్వంత కుమారున్ని వారి పాపస్థితి నుండి విడిపించటానికి లోకానికి అనగా ప్రజల కొరకు పంపాడు తండ్రి. తండ్రి అభీష్టం నెరవేర్చే కుమారుడు, కుమారుని మహిమపరచే పరిశుద్ధాత్మ, కుమారున్ని దేవా అని పిలిచే తండ్రి, ఆత్మ వాక్యమే దేవుని వాక్యం అని చెప్పే కుమారుడు ఒక కుటుంబంలో భాగంగా ముగ్గురు వ్యక్తులు ఒకరిని ఒకరు మహిమపరచే అనూహ్యమైన నిత్య సంబంధాన్ని మానవాళికి చూపించి, అదే స్థితిలోనికి తమ పిల్లలను అనగా యేసు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన పిల్లలను కూడా సమకూర్చాలన్న యోచన బైబిల్ సమగ్ర పరిశీలనకు సారాంశం అని చెప్పాలి.. మార్కు 1:15 - కాలము సంపూర్ణమైయున్నది. ...

యెహెూవా రాజ్యం చేస్తున్నాడు | Jehovah is ruling

చిత్రం
యెహెూవా రాజ్యం చేస్తున్నాడు   నిర్గమ 15:18 లో యెహెూవా నిరంతరం పాలిస్తాడు లేక రాజ్యం చేస్తాడు అన్న మాటలు కనిపిస్తాయి. అలాగే  సంఖ్యా 23:21 లో ఇశ్రాయేలు యొక్క రాజు యెహెూవాయే అన్న అర్థం కనిపిస్తుంది. ఇదే కోవలో  ద్వితీ 33:5 ,  యెషయా 43:15 లో యెహెూవా ఇశ్రాయేలు పై రాజ్యం చేయువాడు అన్న సందేశం మనకు కనిపిస్తుంది. అలాగే ఇశ్రాయేలు మాత్రమే కాక సకల జనుల పైనా ఆయనే పాలించు రాజు అన్న సందేశం కూడా మనకి బైబిల్లో కనిపిస్తుంది.  2వ రాజుల గ్రంధం 19:15 లో ఆయన అందరికీ దేవుడని, రాజని చెప్పే దాఖలాలు కనిపిస్తాయి. ఇంకా స్పష్టంగా  యెషయా 6:5, యిర్మియా 16:18, కీర్తన 29:10, 17:2 , కూడా ఇదే భావాన్ని మనకు అందిస్తున్నాయి. 93వ కీర్తన ను గమనిస్తే యెహోవా రాజ్యం చేస్తున్నాడు. ప్రభావాన్ని ఆయన వస్త్రంగా ధరించి యున్నాడు.. అంటూ ఆయన రాజసం సర్వ భూమండలం పైనా విస్తరించి ఉన్నట్టుగా కీర్తనాకారుడు ప్రశంసిస్తున్నట్టు గమనిస్తున్నాం. ఇదే మాటలు  కీర్తన 96:10, 97:1, 99:1-4, 145:11 .  కూడా ఆయనను సకల భూరాజ్యాలకు అధిపతి అని ప్రకటిస్తున్నాయి. ఆయన రాజ్యం ఇశ్రాయేలుకు మాత్రమే పరిమితం కాక అన్య జనులకు, సకల భూ ర...

క్రైస్తవ విశ్వాసి ఎవరు? | Who is a Christian Beleiver?

చిత్రం
క్రైస్తవ విశ్వాసి ఎవరు? |  Who is a Christian? అపొస్తలుల కార్యములు 11:26 ప్రకారం, యేసు అనుచరులను అనగా " యేసు చెప్పినట్లు నడుచువారు " ( 1 యోహాను 2:6 ) వారిని " మొదట అంతియొకయలో క్రైస్తవులు " అని పిలిచారు. ఎఫెసీయులకు 2:8-9 ప్రకారం ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా క్రైస్తవుడు అవుతాడు, నియమాల జాబితాను లేదా మంచి పనులను అనుసరించడం ద్వారా కాదు: " మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే " రోమా 10:9-10 ఇలా చెబుతోంది, " యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు ." హృదయంలో నమ్మటం, ఆయనను రాజుగా ఒప్పుకోవడం, నాయకునిగా అనుసరించడం, ఆయన బోధలను అనుసరించి సమర్థిస్తూ, నోటితో ఆయనను మరియు ఆయన బోధలను ఒప్పుకొని ప్రకటించే జీవితం ఆయన ద్వారా రక్షింపబడిన జీవితం. నిజమైన క్రైస్తవుడు యేసు “ప్రభువు" " అధిపతి" "రాజు" "యేలినవాడు" అని చెప్పడానికి సిగ్గుపడడు మరియు “ యేసు మృతులలో నుండి పునరుత్థానం "చేయబడ్డాడు" అని కూడా ...